(1 / 5)
సత్యభామ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మోస్తరు కలెక్షన్లు సాధించింది.
(2 / 5)
సత్యభామ చిత్రం జూన్ 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. మంచి వ్యూస్ దక్కించుకుంది. కొన్ని రోజులు ప్రైమ్ వీడియో ట్రెండింగ్‍లో టాప్‍లో నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం మరో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టనుంది.
(3 / 5)
సత్యభామ మూవీ ఆగస్టు 1వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూలై 29) వెల్లడించింది.
(4 / 5)
సత్యభామ చిత్రంలో కాజల్‍తో పాటు నవీన్ చంద్ర కూడా లీడ్ రోల్ చేశారు. ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవివర్మ కీలక పాత్రలు పోషించారు.
(5 / 5)
సత్యభామను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు సుమన్ చిక్కల. గూఢచారి, మేజర్ చిత్రాలకు దర్శకత్వం చేసిన శశికిరణ్ తిక్కా.. ఈ మూవీకి ఓ నిర్మాతగా ఉండటంతో పాటు స్క్రీన్‍ప్లే బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
ఇతర గ్యాలరీలు