తెలుగు న్యూస్ / ఫోటో /
కీళ్ల నొప్పుల నుంచి గ్యాస్ సమస్య వరకు ఈ పువ్వుతో చాలా ప్రయోజనాలు
Star Anise Benefits : ఆయుర్వేద చికిత్సలో అనాసపువ్వును మసాలా దినుసుగానే కాకుండా ఔషధంగా కూడా పరిగణిస్తారు. కీళ్ల నొప్పులు, గ్యాస్ ఉబ్బరం, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ స్టార్ ఆనిస్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
(1 / 6)
అనాసపువ్వును ఆంగ్లంలో 'స్టార్ ఆనిస్' అని కూడా పిలుస్తారు. దీనిని గరం మసాలాగా ఉపయోగిస్తారు. బిర్యానీ, గ్రేవీ తయారీలో వాడుతారు. అయితే ఈ పువ్వు చాలా ప్రయోజనకరమైన ఔషధం. కీళ్ల నొప్పుల నుండి గ్యాస్, ఉబ్బరం వరకు సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించవచ్చు.
(2 / 6)
ఎనిమిది నుంచి పది పువ్వులను నీటిలో మరిగించి ఆ నీటిని ఉదయాన్నే తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(4 / 6)
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు దీనితో తయారు చేసిన టీలో తేనె కలుపుకొని తాగాలి. దీనిలో ఉండే ఔషధ గుణాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. యాంటీ వైరల్ గుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
(5 / 6)
తరచూ సీజనల్ ఇన్ఫెక్షన్ల వల్ల గొంతునొప్పి, శ్లేష్మం ఏర్పడతాయి. ఈ టీ తాగడం వల్ల గొంతులో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. అనాస పువ్వులోని ఔషధ గుణాలు ఊపిరితిత్తుల్లో మంటను తగ్గిస్తాయి.
ఇతర గ్యాలరీలు