తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Thailand Tour : 4 రోజుల 'థాయ్లాండ్' ట్రిప్.. సఫారీతో పాటు ఐల్యాండ్ లో బోట్ జర్నీ, తాజా టూర్ ప్యాకేజీ ఇదే
- IRCTC Tourism Hyderabad Thailand Tour : థాయ్లాండ్ ను చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఇందులో భాగంగా 4 రోజుల పాటు పర్యటిస్తారు. బ్యాంకాక్, పట్టాయా వంటి టూరిజం స్పాట్ లను చూస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…….
- IRCTC Tourism Hyderabad Thailand Tour : థాయ్లాండ్ ను చూసేందుకు IRCTC టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఇందులో భాగంగా 4 రోజుల పాటు పర్యటిస్తారు. బ్యాంకాక్, పట్టాయా వంటి టూరిజం స్పాట్ లను చూస్తారు. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…….
(1 / 7)
థాయ్ లాండ్ కు వెళ్లి చిల్ అయ్యే ప్లాన్ ఉందా..? ఇందుకోసం తక్కువ బడ్జెట్ లో అందించే టూరిజం ప్యాకేజీల కోసం చూస్తున్నారా..? అయితే మీలాంటి వారికోసం IRCTC టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. (image source from unsplash.com)
(2 / 7)
హైదరాబాద్ నుంచి థాయ్ లాండ్ కు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది ఐఆర్సీటీసీ టూరిజం. ‘TREASURES OF THAILAND EX HYDERABAD’ పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 25 జులై, 2024 తేదీన అందుబాటులో ఉంది.(image source from unsplash.com)
(3 / 7)
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకుంటే 4 రోజుల పాటు థాయ్ లాండ్ లో పర్యటిస్తారు.థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని(Thailand Tour Package) ఫ్లైట్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. తొలి రోజు రాత్రి 09 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సి ఉంటుంది. ముందుగా పట్టాయాకు చేరుకుంటారు. పలు పర్యాటక ప్రాంతాలను చూస్తారు. రాత్రికి పట్టాయాలోనే ఉంటారు.(image source from unsplash.com)
(4 / 7)
ఇక 2వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత…ఇండియన్ లాంచ్ లో ఐల్యాండ్ కు వెళ్తారు. ఆ తర్వాత నాంగ్ నుచ్ ట్రాఫికల్ గార్డెన్ కు వెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో భోజనం ఉంటుంది. రాత్రి కూడా పట్టాయాలోనే బస ఉంటుంది. మూడో రోజు పట్టాయాలోనే సఫారీకి వెళ్తారు.మెరైన్ పార్క్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత బ్యాంకాక్ కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు.(image source from unsplash.com)
(5 / 7)
4వ రోజు బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. పలు ఆలయాలను కూడా సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు బ్యాంకాక్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(image source from unsplash.com)
(6 / 7)
హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.57, 820గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 49, 450గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 49, 450/గా ప్రకటించారు. 5- 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.(image source from unsplash.com)
(7 / 7)
https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే… 040-27702407 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. కేవలం ఈ ప్యాకేజీ మాత్రమే కాకుండా వేర్వురు ప్రాంతాలకు ఆపరేట్ చేస్తున్న ప్యాకేజీలను కూడా ఈ సైట్ లో చూడొచ్చు.(image source from unsplash.com)
ఇతర గ్యాలరీలు