తెలుగు న్యూస్ / ఫోటో /
Coastal Karnataka Tour : ఒకే ప్యాకేజీలో గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి ట్రిప్ - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ
- Hyderabad Coastal Karnataka Tour package: కర్ణాటక తీర ప్రాంతాన్ని చూసేందుకు టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ఈ నవంబర్ నెలలోనే జర్నీ ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి…
- Hyderabad Coastal Karnataka Tour package: కర్ణాటక తీర ప్రాంతాన్ని చూసేందుకు టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. ఈ నవంబర్ నెలలోనే జర్నీ ఉంది. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి…
(1 / 7)
ఈ నవంబర్ నెలలో అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకునే ప్లాన్ ఉందా..? మీలాంటి వారి కోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లి… కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.(image source from unsplash.com)
(2 / 7)
హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం నవంబర్ 12, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.(image source from unsplash.com)
(3 / 7)
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది.మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే సైట్ లోకి వెళ్లి బుకింగ్ కూడా చేసుకోవచ్చు. (image source from unsplash.com)
(4 / 7)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ.38,810ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22520 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18020గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి. స్టాం స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15020గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 35810గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19520గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 ఈ లింక్ పై క్లిక్ చేసి ధరల ఛార్ట్ చూడొచ్చు.(image source from unsplash.com)
(5 / 7)
షెడ్యూల్ వివరాలు చూస్తే.. తొలి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. ఇక రెండో రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు. 4వరోజు Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు.(image source from unsplash.com)
(6 / 7)
5వ రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.(image source from unsplash.com)
ఇతర గ్యాలరీలు