తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2024 Orange Cap: ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్న రాయల్స్ బ్యాటర్.. సన్ రైజర్స్ బౌలర్‌కు పర్పుల్ క్యాప్
- IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. ఇక పర్పుల్ క్యాప్ ను బుమ్రా నుంచి సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ అందుకున్నాడు.
- IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. ఇక పర్పుల్ క్యాప్ ను బుమ్రా నుంచి సన్ రైజర్స్ బౌలర్ నటరాజన్ అందుకున్నాడు.
(1 / 5)
IPL 2024 Orange Cap: సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో రాణించాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్. అతడు కేవలం 48 బంతుల్లో 77 రన్స్ చేసినా.. తన టీమ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు.
(2 / 5)
IPL 2024 Orange Cap: ఈ ఇన్నింగ్స్ తో రియాన్ పరాగ్ ఐపీఎల్ 2024లో 9 ఇన్నింగ్స్ లో 409 రన్స్ చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేసులో అతడు నాలుగో స్థానానికి దూసుకెళ్లాడు. ఐపీఎల్ చరిత్రలో 400కుపైగా రన్స్ తొలి అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఇండియన్ క్రికెటర్ గా పరాగ్ నిలిచాడు.
(3 / 5)
IPL 2024 Orange Cap: ఈ మ్యాచ్ తర్వాత రియాన్ పరాగ్.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లను వెనక్కి నెట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. అతడు 10 ఇన్నింగ్స్ లో 406 రన్స్ చేశాడు.
(4 / 5)
IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గర ఉంది. అతడు 10 ఇన్నింగ్స్ లో 509 రన్స్ చేశాడు. రెండో స్థానంలో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి 500 రన్స్ తో ఉన్నాడు.
ఇతర గ్యాలరీలు