International women's day 2024: మనదేశంలో టాప్ 5 మహిళా సీఈవోలు వీళ్లే-international womens day 2024 five most influential women ceos in india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  International Women's Day 2024: మనదేశంలో టాప్ 5 మహిళా సీఈవోలు వీళ్లే

International women's day 2024: మనదేశంలో టాప్ 5 మహిళా సీఈవోలు వీళ్లే

Mar 05, 2024, 08:09 PM IST Haritha Chappa
Mar 05, 2024, 08:09 PM , IST

  • International Women's Day 2024: భారత్‌లో మహిళా సీఈవోలు ఎందరో వ్యాపారాలను  విజయవంతంగా నడిపిస్తున్నారు.  ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత ప్రభావవంతమైన సీఈవోలు ఎవరో తెలుసుకోండి.

ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఒకసారి అందరూ తలచుకుంటారు. ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళా సాధికారత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. భారతదేశంలో మహిళా సీఈవోలు ఎందరో ఉన్నారు. వారు తమ కంపెనీలను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

(1 / 6)

ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధించిన విజయాలను ఈ సందర్భంగా ఒకసారి అందరూ తలచుకుంటారు. ఈ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం, మహిళా సాధికారత ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. భారతదేశంలో మహిళా సీఈవోలు ఎందరో ఉన్నారు. వారు తమ కంపెనీలను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

స్వాతి అజయ్ పిరమల్:  స్వాతి అజయ్ పిరమల్… పిరమల్ గ్రూప్ వైస్ చైర్ పర్సన్. ఆమె నాయకత్వంలో హెల్త్ కేర్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి, నాణ్యమైన ఆరోగ్య పద్దతులను ఆమె అందుబాటులోకి తెచ్చింది. 

(2 / 6)

స్వాతి అజయ్ పిరమల్:  స్వాతి అజయ్ పిరమల్… పిరమల్ గ్రూప్ వైస్ చైర్ పర్సన్. ఆమె నాయకత్వంలో హెల్త్ కేర్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి, నాణ్యమైన ఆరోగ్య పద్దతులను ఆమె అందుబాటులోకి తెచ్చింది. (PTI)

దేవికా బుల్చందానీ: ఒగిల్వీ నార్త్ అమెరికా సీఈఓగా దేవికా బుల్చందానీ ఉన్నారు. కొన్ని ఐకానిక్ అడ్వర్టయిజింగ్ క్యాంపెయిన్ల వెనుక  ఆమె సృజనాత్మక కనిపిస్తుంది. ప్రకటనల పరిశ్రమలో ఆమె మంచి గుర్తింపును సాధించింది, మహిళలను సృజనాత్మక రంగాలలో రాణించడానికి ఈమె ప్రేరణగా నిలిచింది.

(3 / 6)

దేవికా బుల్చందానీ: ఒగిల్వీ నార్త్ అమెరికా సీఈఓగా దేవికా బుల్చందానీ ఉన్నారు. కొన్ని ఐకానిక్ అడ్వర్టయిజింగ్ క్యాంపెయిన్ల వెనుక  ఆమె సృజనాత్మక కనిపిస్తుంది. ప్రకటనల పరిశ్రమలో ఆమె మంచి గుర్తింపును సాధించింది, మహిళలను సృజనాత్మక రంగాలలో రాణించడానికి ఈమె ప్రేరణగా నిలిచింది.(ogilvy.com)

లీనా నాయర్: చానెల్ సీఈఓగా లీనా నాయర్ లగ్జరీ ఫ్యాషన్ ను కొత్తగా నిర్వచించారు. ఆమె నాయకత్వం చానెల్ సంస్థను కొత్త విజయాల స్థాయికి నడిపించాయి, ఫ్యాషన్ పరిశ్రమలో ఔత్సాహిక మహిళా నాయకులకు ఆమె ఆదర్శం.

(4 / 6)

లీనా నాయర్: చానెల్ సీఈఓగా లీనా నాయర్ లగ్జరీ ఫ్యాషన్ ను కొత్తగా నిర్వచించారు. ఆమె నాయకత్వం చానెల్ సంస్థను కొత్త విజయాల స్థాయికి నడిపించాయి, ఫ్యాషన్ పరిశ్రమలో ఔత్సాహిక మహిళా నాయకులకు ఆమె ఆదర్శం.(HT File Photo)

కిరణ్ మజుందార్ షా: భారతదేశంలో బయోటెక్నాలజీ పరిశ్రమకు మార్గదర్శకురాలు కిరణ్ మజుందార్ షా. బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు ఈమె. బయోటెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా తన సంస్థను నిలిపింది, ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ఈమె స్ఫూర్తిగా నిలిచింది. 

(5 / 6)

కిరణ్ మజుందార్ షా: భారతదేశంలో బయోటెక్నాలజీ పరిశ్రమకు మార్గదర్శకురాలు కిరణ్ మజుందార్ షా. బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు ఈమె. బయోటెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా తన సంస్థను నిలిపింది, ప్రపంచవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ఈమె స్ఫూర్తిగా నిలిచింది. (HT File Photo)

రోషిణి నాడార్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోషిణి నాడార్. టెక్ రంగంలో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈమె ఎంతో మంది యువతకు ఆదర్శం. 

(6 / 6)

రోషిణి నాడార్: హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్ పర్సన్ రోషిణి నాడార్. టెక్ రంగంలో తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈమె ఎంతో మంది యువతకు ఆదర్శం. (HT Photo)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు