Asian Champions Trophy: ఫైనల్‍కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‍లో అదిరే విజయం.. టైటిల్ పోరు ఎప్పుడంటే..
- Asian Champions Trophy 2024: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగింది. కొరియాతో సెమీస్‍లో గెలిచి ఫైనల్‍లో అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- Asian Champions Trophy 2024: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగింది. కొరియాతో సెమీస్‍లో గెలిచి ఫైనల్‍లో అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ దుమ్మురేపుతోంది. అదిరే ఆటతో ఘన విజయాలు సాధిస్తూ ఫైనల్‍కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా నేడు (సెప్టెంబర్ 16) జరిగిన సెమీఫైనల్‍లో దక్షిణ కొరియాపై టీమిండియా విజయం సాధించింది. (Hockey India)
(2 / 5)
సెమీస్‍లో భారత్ 4-1 తేడాతో కొరియాపై ఘన విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. మ్యాచ్ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించి గెలిచింది.
(3 / 5)
ఈ మ్యాచ్ 13వ నిమిషంలోనే ఉత్తమ్ సింగ్ గోల్ బాదాడు. దీంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత 19వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ గోల్ సాధించాడు. దీంతో తొలి అర్ధ భాగం ముగిసే సరికి భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
(4 / 5)
జర్మన్‍ప్రీత్ సింగ్ 32వ నిమిషంలో గోల్ బాదాడు. అయితే, ఆ తర్వాతి నిమిషంలోనే కొరియా ప్లేయర్ జిహూన్ యాంగ్ గోల్ చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా ఆడాయి. భారత ప్లేయర్ హర్మన్ ప్రీత్ సింగ్ 45వ నిమిషంలో మరో గోల్ చేశాడు. దీంతో స్కోరు 4-1కు చేరింది. చివరి వరకు ఆధిపత్యాన్ని నిలుపుకొని విజయం సాధించింది భారత్.
ఇతర గ్యాలరీలు