Ind vs Ban 2nd Test: టీమిండియా వరల్డ్ రికార్డు.. టెస్టుల్లో టీ20 ఆడేశారు.. దంచి కొట్టిన యశస్వి, రోహిత్, శుభ్‌మన్
- Ind vs Ban 2nd Test: టీమిండియా టెస్ట్ క్రికెట్ లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్.. టెస్ట్ క్రికెట్ లో ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీ, ఫాస్టెస్ట్ టీమ్ హండ్రెడ్ రికార్డులు క్రియేట్ చేసింది.
- Ind vs Ban 2nd Test: టీమిండియా టెస్ట్ క్రికెట్ లో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్.. టెస్ట్ క్రికెట్ లో ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీ, ఫాస్టెస్ట్ టీమ్ హండ్రెడ్ రికార్డులు క్రియేట్ చేసింది.
(1 / 5)
Ind vs Ban 2nd Test: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు టీ20 స్టైల్లో చెలరేగిపోయారు. రోహిత్, యశస్వి, శుభ్‌మన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో ఇండియన్ టీమ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.(PTI)
(2 / 5)
Ind vs Ban 2nd Test: కాన్పూర్ టెస్టులో రెండు, మూడు రోజుల ఆట వర్షం వల్ల పూర్తిగా రద్దయిన విషయం తెలుసు కదా. దీంతో నాలుగో రోజు టీమిండియా టీ20 స్టైల్లో చెలరేగి రెండు రోజుల్లో అయినా ఈ మ్యాచ్ లో ఫలితం రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఓపెనర్లు రోహిత్, యశస్వి వచ్చీ రాగానే బౌండరీల వర్షం కురిపించారు.(AP)
(3 / 5)
Ind vs Ban 2nd Test: రోహిత్, యశస్వి తొలి మూడు ఓవర్లలోనే 50 పరుగులు చేయడం విశేషం. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా టీమ్ ఫిఫ్టీ చేసిన వరల్డ్ రికార్డు ఇండియ సొంతమైంది. రోహిత్ 11 బంతుల్లోనే మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. యశస్వి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతోపాటు 51 బంతుల్లోనే 12 ఫోర్లు, 2 సిక్స్ లతో 72 రన్స్ చేసి ఔటయ్యాడు.(AP)
(4 / 5)
Ind vs Ban 2nd Test: టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ టీమ్ 100 వరల్డ్ రికార్డు కూడా టీమిండియా సొంతమైంది. కేవలం 10.1 ఓవర్లలోనే టీమ్ స్కోరు 100 దాటేసింది. గతంలో 12.2 ఓవర్లతో తమ పేరిటే ఉన్న రికార్డును ఇండియన్ టీమ్ మరింత మెరుగుపరిచింది. శుభ్‌మన్ గిల్ కూడా వేగంగా ఆడాడు.(PTI)
(5 / 5)
Ind vs Ban 2nd Test: అంతకుముందు బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినుల్ హక్ సెంచరీ చేయడంతో ఆ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌటైంది. ఇండియా బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, అశ్విన్, ఆకాశ్‌దీప్ తలా రెండు వికెట్లు తీయగా.. జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ వికెట్ తో టెస్టుల్లో జడ్డూ వికెట్ల సంఖ్య 300కు చేరుకుంది.(AP)
ఇతర గ్యాలరీలు