Cold wave in India : 'కోల్డ్​ వేవ్'​తో ఉత్తర భారతం గజగజ..-in pics extreme cold and dense fog engulfs several parts of india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cold Wave In India : 'కోల్డ్​ వేవ్'​తో ఉత్తర భారతం గజగజ..

Cold wave in India : 'కోల్డ్​ వేవ్'​తో ఉత్తర భారతం గజగజ..

Dec 26, 2022, 01:35 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Dec 26, 2022, 01:35 PM , IST

Cold wave in India : దేశవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తర్​ ప్రదేశ్​​లో ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉదయాన్నే పొగమంచు అలుముకుంది. చలితో ప్రజలు వణికిపోతున్నారు. కోల్డ్​ వేవ్​ పరిస్థితులు ఇంకొన్ని రోజుల పాటు ఉంటాయని ఐఎండీ పేర్కొంది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలను సోమవారం ఉదయం పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో క్రిస్మస్​ నాడు ఉష్ణోగ్రతలు 8ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి.

(1 / 7)

ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలను సోమవారం ఉదయం పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో క్రిస్మస్​ నాడు ఉష్ణోగ్రతలు 8ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి.(HT)

అమృత్​సర్​లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సరిహద్దుల్లో బీఎస్​ఎఫ్​ జవాన్లు.. తీవ్రమైన చలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.

(2 / 7)

అమృత్​సర్​లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సరిహద్దుల్లో బీఎస్​ఎఫ్​ జవాన్లు.. తీవ్రమైన చలిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.(ANI )

గురుగ్రామ్​లో ఈ సీజన్​లోనే తొలి కోల్డ్​ వేవ్​ నమోదైంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి.

(3 / 7)

గురుగ్రామ్​లో ఈ సీజన్​లోనే తొలి కోల్డ్​ వేవ్​ నమోదైంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయి.(Yogendra Kumar)

జమ్ములో మంచు కురుస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా ఇక్కడి రైల్వే, విమాన సేవలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బస్సు సేవల పరిస్థితి కూడా ఇంతే!

(4 / 7)

జమ్ములో మంచు కురుస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా ఇక్కడి రైల్వే, విమాన సేవలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బస్సు సేవల పరిస్థితి కూడా ఇంతే!(PTI)

పట్నాలో కోల్డ్​ వేవ్​ కారణంగా 8వ తరగతి వరకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

(5 / 7)

పట్నాలో కోల్డ్​ వేవ్​ కారణంగా 8వ తరగతి వరకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.(PTI)

కోల్​కతాలో పరిస్థితులు ఇలా.. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ప్రయాణాలు కూడా కష్టంగా మారాయి.

(6 / 7)

కోల్​కతాలో పరిస్థితులు ఇలా.. దట్టమైన పొగమంచు అలుముకోవడంతో ప్రయాణాలు కూడా కష్టంగా మారాయి.(PTI)

జలంధర్​లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని స్కూళ్లకు జనవరి 21 వరకు ఓ వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. పాఠశాలలు ఉదయం 10 గంటల తర్వాత తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.

(7 / 7)

జలంధర్​లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని స్కూళ్లకు జనవరి 21 వరకు ఓ వెసులుబాటును కల్పించింది ప్రభుత్వం. పాఠశాలలు ఉదయం 10 గంటల తర్వాత తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది.(Shammi Mehra)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు