AP Heavy Rains : ఏపీలో మరో 3 రోజులు అతి భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్-imd announced low pressure formed in south east bay of bengal heavy rains in ap districts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Heavy Rains : ఏపీలో మరో 3 రోజులు అతి భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

AP Heavy Rains : ఏపీలో మరో 3 రోజులు అతి భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన సీఎస్

Oct 14, 2024, 04:24 PM IST Bandaru Satyaprasad
Oct 14, 2024, 04:24 PM , IST

AP Heavy Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధ ,గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్,స్పెషల్ సీఎస్ సిసోడియా వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. 

(1 / 6)

పోలీసు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్&బి అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్,  ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరినీ వెంటనే వెనక్కి రప్పించాలన్నారు. ఈదురుగాలుల తీవ్రతను బట్టి విద్యుత్ శాఖ తగిన చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు. 

(2 / 6)

భారీ వర్షాలు ప్రభావంతో వాగులు పొంగిపొర్లే మార్గాల్లోని రోడ్లు వెంటనే మూసివేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండేవారిని సచివాలయ సిబ్బంది సురక్షిత భవనాలకు పంపాలన్నారు. అర్బన్ ఫ్లడ్ వలన రోడ్లమీద నీళ్లు నిలవకుండా ముందుగానే డ్రైనేజీలు శుభ్రం చేయాలన్నారు. కాలువలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. 

(3 / 6)

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించింది.  సోమవారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే  అవకాశం ఉందన్నారు. 

(4 / 6)

రేపు(మంగళవారం) కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధ ,గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

(5 / 6)

భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండవద్దన్నారు. పాత భవనాలు వదిలి సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.  తిరుపతి,  చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.   

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు