Ileana son 1st birthday: కుమారుడి తొలి పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసిన ఇలియానా: ఫొటోలు
Ileana son 1st birthday: తన కుమారుడు కొయా ఫొనిక్స్ డోలాన్ తొలి పుట్టిన రోజును ముచ్చటగా చేశారు హీరోయిన్ ఇలియానా. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
(1 / 8)
హీరోయిన్ ఇలియానా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల నుంచి దూరంగా ఉంటున్నారు. కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తున్నారు. తాజాగా, తన కుమారుడు కొయా ఫొనిక్స్ డోలాన్ తొలి పుట్టిన రోజు వేడుకను ఇలియానా సెలెబ్రేట్ చేశారు.
(2 / 8)
తన కుమారుడు ఫొనిక్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఇలియానా. “టైమ్ ఎక్కడికి వెళ్లింది? నా బేబీ ఒకటికి వచ్చేశారు” అని క్యాప్షన్ పెట్టారు. తన కుమారుడికి ఏడాది నిండిందని తెలిపారు.
(3 / 8)
బొమ్మలతో కొయా ఫొనిక్స్ బిజీగా ఆడుకుంటున్న ఫొటోలను కూడా ఇలియానా పంచుకున్నారు. ఇంట్లోనే డెకరేషన్ చేసి బర్త్ డే చేశారు.
(4 / 8)
తన జీవిత భాగస్వామి మైకేల్ డోలాన్‍తో కలిసి కుమారుడు కొయా పుట్టిన రోజును జరిపారు ఇలియానా. తన ఒడిలో కొయా నిద్రిస్తున్న ఫొటో ఇది.
(5 / 8)
తన ప్రెగ్నెన్సీని 2023 ఏప్రిల్‍లో ఇలియానా ప్రకటించారు. గతేడాది ఆగస్టు 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు తొలి పుట్టిన రోజు ఫొటోలను ఐదు రోజులు ఆలస్యంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(6 / 8)
కుమారుడు పుట్టిన సమయంలో తాము ఎంత ఆనందానికి లోనయ్యామో తెలుపుతూ అప్పట్లో ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఇలియానా.
(7 / 8)
తాను ప్రేమలో ఉన్న మైకేల్ డోలాన్‍ను ఇలియానా గతేడాది మే 13న వివాహం చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. రిలేషన్ గురించి వెల్లడించినా.. వివాహంపై ఆమె అధికారికంగా చెప్పలేదు.
ఇతర గ్యాలరీలు