తెలుగు న్యూస్ / ఫోటో /
Yashasvi Jaiswal: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ యశస్వి జైస్వాల్.. కేన్ విలియమన్స్‌ను వెనక్కి నెట్టిన యంగ్ ప్లేయర్
- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో ఏకంగా 712 రన్స్ చేసిన యశస్వి.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను వెనక్కి నెట్టాడు.
- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిబ్రవరి నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో ఏకంగా 712 రన్స్ చేసిన యశస్వి.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను వెనక్కి నెట్టాడు.
(1 / 6)
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ ఊహించినట్లే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో ఏకంగా 712 రన్స్ చేసిన అతడు.. అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇండియా తరఫున గవాస్కర్ తర్వాత ఒక సిరీస్ లో 700కుపైగా రన్స్ చేసిన రెండో బ్యాటర్ యశస్వి జైస్వాల్(Reuters)
(2 / 6)
Yashasvi Jaiswal: ఫిబ్రవరి నెలకు యశస్వితోపాటు కేన్ విలియమ్సన్, పథుమ్ నిస్సంక నామినేట్ అయినా కూడా ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టి యశస్వి అవార్డును గెలుచుకున్నాడు.(AFP)
(3 / 6)
Yashasvi Jaiswal: ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ యశస్వి జైస్వాలే కావడం విశేషం. ఇంగ్లండ్ పై వరుసగా రెండు టెస్టుల్లో అతడు డబుల్ సెంచరీలు చేశాడు.(AFP)
(4 / 6)
Yashasvi Jaiswal: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ ఇలాంటి అవార్డులు గెలుచుకుంటానన్న విశ్వాసం యశస్వి వ్యక్తం చేశాడు.(PTI)
(5 / 6)
Yashasvi Jaiswal: తాను ఆడిన తొలి ఐదు టెస్టుల సిరీస్ లోనే టీమిండియా 4-1తో గెలవడం చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా యశస్వి అన్నాడు.(PTI)
ఇతర గ్యాలరీలు