Telangana Formation Day : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్ బండ్-hyderabad telangana formation day celebrations june 2nd on tank bund with special program ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Formation Day : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్ బండ్

Telangana Formation Day : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా ట్యాంక్ బండ్

May 29, 2024, 09:34 PM IST Bandaru Satyaprasad
May 29, 2024, 09:34 PM , IST

  • Telangana Formation Day : జూన్ 2న తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. సీఎస్ శాంతి కుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ ను  సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. సీఎస్ శాంతి కుమారి ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 2న  సాయంత్రం ట్యాంక్ బండ్ పై పండుగ వాతవరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగు రంగుల  విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి,  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ రంగాల  ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  

(1 / 5)

రాష్ట్ర అవతరణ వేడుకలలో సామాన్య ప్రజలు కూడా ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఆనందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు  రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు జరిపేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రధాన వేదికపై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

(2 / 5)

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ' పై పోలీసు సిబ్బందితో  ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణాసంచాలు పేలుస్తూ ఉత్సవ వాతవరణాన్ని అణుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.  వీటిలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్లతో ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి.

(3 / 5)

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లను బుధవారం  సాయంత్రం పలు విభాగాల ఉన్నతాధికారులు ట్యాంక్ బండ్ వేదిక వద్ద పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిథిలకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్ , బ్యారికేడింగ్, పార్కింగ్ , తాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తూ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్ ల తో, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

(4 / 5)

మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ , హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీ సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, పంచాయత్ రాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సిటీ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, వివిధ శాఖల అధికారులు  ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు