తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Rains : హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం, ట్రాఫిక్ కష్టాలు షురూ!
- Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
- Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
(1 / 6)
హైదరాబాద్ లో భారీ వర్షం దంచికొడుతుంది. సోమవారం సాయంత్రం నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
(2 / 6)
ఈదురుగాలుల ధాటికి హైదరాబాద్ లో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, షేక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్‌గూడ, లంగర్‌హౌస్, గండిపేట్, శివరాంపల్లి, ఎల్బీనగర్, నాగోల్ , మన్సూరాబాద్, బీఎన్‌రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్మెట్ లో భారీగా వర్షం కురిసింది.
(3 / 6)
భారీ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
(4 / 6)
హైదరాబాద్ నగరంలోని పశ్చిమ ప్రాంతాల్లో భారీ ఉరుములతో వడగళ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్ తో పాటు దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలైన ఎల్‌బి నగర్, సరూర్ నగర్‌లో మరో 1 గంటపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
(5 / 6)
రాష్ట్రంలో మరో అయిదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు