తెలుగు న్యూస్ / ఫోటో /
Cyber Crime : పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం, డబ్బంతా తీవ్రవాదుల వెబ్ సైట్ కు మళ్లింపు
- Cyber Crime : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడిన 9 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
- Cyber Crime : పెట్టుబడుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడిన 9 మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
(1 / 7)
పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 9 మంది సైబర్ కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.712 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
(2 / 7)
సైబర్ నేరగాళ్ల వద్ద నుంచి భారీగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, డెబిట్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
(3 / 7)
ముంబయి, లఖ్‌నవూ, గుజరాత్, హైదరాబాద్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు... దుబాయ్, చైనాకు చెందిన సైబర్ నేరస్థులతో సంబంధాలున్నట్లు హైదరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు.
(4 / 7)
హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పెట్టుబడుల పేరుతో దోచిన డబ్బంతా క్రిప్టో కరెన్సీ ద్వారా దుబాయ్ నుంచి చైనా వెళ్తున్నట్లు గుర్తించామన్నారు.
(5 / 7)
తీవ్రవాదులు ఉపయోగించే క్రిప్టో వెబ్‌సైట్‌కు ఈ డబ్బును మళ్లించినట్లు విచారణలో తేలిందని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఇలాంటి మోసాలపై జాతీయ స్థాయిలో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.
(6 / 7)
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా కొందరు అమాయకలు మోసపోతున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో పడుతున్నారని సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఓ ఐటీ ఉద్యోగి రూ.82 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు చేశారన్నారు.
ఇతర గ్యాలరీలు