How to quit smoking: స్మోకింగ్ మానేసేందుకు 6 దశల స్ట్రాటజీ ఇదే-how to quit smoking know 6 steps strategy from experts in pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  How To Quit Smoking: స్మోకింగ్ మానేసేందుకు 6 దశల స్ట్రాటజీ ఇదే

How to quit smoking: స్మోకింగ్ మానేసేందుకు 6 దశల స్ట్రాటజీ ఇదే

Jan 26, 2023, 03:35 PM IST HT Telugu Desk
Jan 26, 2023, 03:35 PM , IST

  • How to quit smoking: మీరు స్మోకింగ్ మానేయాలని పదే పదే ప్రయత్నిస్తూ విఫలమైతే ఈ 6 దశల స్ట్రాటజీ మీకోసమే. సిగరెట్ మానేసేందుకు నిపుణులు సూచించిన దశలు ఇవి. మీరూ చదవండి.

ధూమపానం హానికరమైన అలవాటు. కాలక్రమేణా ఇది వ్యసనంగా మారుతుంది. జీవితంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. క్యాన్సర్ నుండి ఊపిరితిత్తుల వ్యాధుల వరకు ధూమపానం అపరిమితమైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఈ వ్యసనాన్ని వదిలివేయడం చాలా ముఖ్యం. కానీ విడిచిపెట్టడానికి కష్టపడతారు. దీనిని ప్రస్తావిస్తూ, పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ ‘ఏదైనా అలవాటును మార్చుకోవడం నమ్మశక్యం కాని సవాలు, అయితే అన్ని వ్యసనాలు చివరికి మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి వాటిని వదిలేయడానికి మనకు ప్రేరణ అవసరం. మీరు మీ వ్యసనాన్ని వదలివేయడం నేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండటం ప్రారంభమవుతుంది..’ అనిచెప్పారు. ధూమపానం మానేయడానికి అంజలి 6 దశల వ్యూహాన్ని కూడా వివరించారు.

(1 / 7)

ధూమపానం హానికరమైన అలవాటు. కాలక్రమేణా ఇది వ్యసనంగా మారుతుంది. జీవితంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. క్యాన్సర్ నుండి ఊపిరితిత్తుల వ్యాధుల వరకు ధూమపానం అపరిమితమైన అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఈ వ్యసనాన్ని వదిలివేయడం చాలా ముఖ్యం. కానీ విడిచిపెట్టడానికి కష్టపడతారు. దీనిని ప్రస్తావిస్తూ, పోషకాహార నిపుణుడు అంజలి ముఖర్జీ ‘ఏదైనా అలవాటును మార్చుకోవడం నమ్మశక్యం కాని సవాలు, అయితే అన్ని వ్యసనాలు చివరికి మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి వాటిని వదిలేయడానికి మనకు ప్రేరణ అవసరం. మీరు మీ వ్యసనాన్ని వదలివేయడం నేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండటం ప్రారంభమవుతుంది..’ అనిచెప్పారు. ధూమపానం మానేయడానికి అంజలి 6 దశల వ్యూహాన్ని కూడా వివరించారు.(Unsplash)

సిగరెట్ స్మోకింగ్ క్విట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైన దశ. హానికరమైన వ్యసనాన్ని విడిచిపెట్టే ప్రక్రియ దృఢమైన సంకల్పంతో ప్రారంభమవుతుంది.

(2 / 7)

సిగరెట్ స్మోకింగ్ క్విట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైన దశ. హానికరమైన వ్యసనాన్ని విడిచిపెట్టే ప్రక్రియ దృఢమైన సంకల్పంతో ప్రారంభమవుతుంది.(Unsplash)

కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి తాజా పండ్లు, కూరగాయలలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకోవాలి.

(3 / 7)

కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి తాజా పండ్లు, కూరగాయలలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకోవాలి.(Unsplash)

ధూమపానం చర్మానికి కూడా హాని చేస్తుంది. రోజూ ఒక గ్లాసు పచ్చి కూరగాయల రసం చర్మానికి పోషణను అందించడంలో సహాయపడుతుంది.

(4 / 7)

ధూమపానం చర్మానికి కూడా హాని చేస్తుంది. రోజూ ఒక గ్లాసు పచ్చి కూరగాయల రసం చర్మానికి పోషణను అందించడంలో సహాయపడుతుంది.(Unsplash)

స్మోకింగ్ కోరికలను తగ్గించడానికి, అధిక ఫైబర్ ఆల్కలీన్ డైట్‌కు అలవాటు పడేందుకు గోధుమ రవ్వ, తృణధాన్యాలు, జొన్నలు, సజ్జలు వంటి ఆహారాలను తరచుగా తీసుకోవాలి

(5 / 7)

స్మోకింగ్ కోరికలను తగ్గించడానికి, అధిక ఫైబర్ ఆల్కలీన్ డైట్‌కు అలవాటు పడేందుకు గోధుమ రవ్వ, తృణధాన్యాలు, జొన్నలు, సజ్జలు వంటి ఆహారాలను తరచుగా తీసుకోవాలి(Unsplash)

చర్మానికి పోషణ అందాలంటే చేపలు, గింజలు, ముదురు ఆకుపచ్చ రంగు గల పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలి.

(6 / 7)

చర్మానికి పోషణ అందాలంటే చేపలు, గింజలు, ముదురు ఆకుపచ్చ రంగు గల పండ్లు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలను రోజూ తీసుకోవాలి.(Unsplash)

వ్యాయామం పోషకాహారానికి జత కలిసి వేగంగా ఆరోగ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుంది.

(7 / 7)

వ్యాయామం పోషకాహారానికి జత కలిసి వేగంగా ఆరోగ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు