తెలుగు న్యూస్ / ఫోటో /
Rishabh Pant 99 OUT: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆరేళ్లుగా వెంటాడుతున్న బ్యాడ్ లక్, ఏడోసారి 90లో ఔట్
Rishabh Pant Falls For 99: రిషబ్ పంత్ టెస్టుల్లో ఇప్పటి వరకు ఆరు సెంచరీలు నమోదు చేయగా.. ఏకంగా ఏడు సార్లు అతనికి సెంచరీలు చేజారాయి. గత ఆరేళ్లలో పంత్ 90-99 రన్స్ మధ్య 7 సార్లు టెస్టుల్లో ఔటయ్యాడు.
(1 / 15)
భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది. న్యూజిలాండ్‌తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజై శనివారం వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన రిషబ్ పంత్.. సెంచరీ ఒక్క పరుగు దూరంలో వికెట్ చేజార్చుకున్నాడు. టెస్టుల్లో రిషబ్ పంత్ సెంచరీ ముంగిట ఇలా ఔటవడం కెరీర్‌లో ఏడోసారి కావడం గమనార్హం. (AFP)
(2 / 15)
ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులతో టీమ్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలిచిన రిషబ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 105 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీ ముంగిట భారీ షాట్లు ఆడిన రిషబ్ పంత్.. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియం ఓరూర్కీ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసి వికెట్లపైకి ఆడుకున్నాడు. (AFP)
(3 / 15)
ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని పంత్ డిఫెన్స్ చేయబోయాడు. కానీ.. ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి వికెట్లను గీరాటేసింది. దాంతో పంత్ చాలా బాధపడుతూ పెవిలియన్ బాట పట్టగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో కేఎల్ రాహుల్ కూడా చాలా నిరాశపడుతూ కనిపించాడు. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైన భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 460పైచిలుకు స్కోరు చేయగలిగిందంటే అది రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ (105) చొరవే. (AFP)
(4 / 15)
2018లో రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 92 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. (AFP)
(5 / 15)
2018లోనే వెస్టిండీస్‌తో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 134 బంతుల్లో 92 పరుగులు చేసి ఔటయ్యాడు (AFP)
(6 / 15)
2021లో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 118 బంతుల్లో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. (AFP)
(7 / 15)
2021లోనే ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 88 బంతుల్లో 91 పరుగులు చేసి ఔటయ్యాడు. (AFP)
(8 / 15)
2022లో శ్రీలంకతో మొహాలి వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 97 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. (AFP)
(9 / 15)
2022లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. (PTI)
(10 / 15)
2024లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 బంతుల్లో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. (PTI)
(11 / 15)
కెరీర్‌లో ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్ 44.75 సగటుతో 2551 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని ఇన్నింగ్స్‌ల్లో 276 ఫోర్లు, 64 సిక్సర్లూ ఉండటం విశేషం. (PTI)
(12 / 15)
వాస్తవానికి ఈ టెస్టు మ్యాచ్‌లో కీపింగ్ చేస్తూ రిషబ్ పంత్ గురువారం గాయపడ్డాడు. అతని మోకాలికి వాపు కూడా వచ్చింది. దాంతో ఒక్క రోజు రెస్ట్ తీసుకున్న పంత్.. శనివారం బ్యాటింగ్‌కి వచ్చి అదరగొట్టేశాడు. (AP)
(13 / 15)
బెంగళూరు టెస్టులో రిషబ్ పంత్ కొట్టిన భారీ సిక్స్‌కి బంతి స్టేడియం వెలుపల పడింది. టిమ్ సౌథీ బౌలింగ్‌లో కొట్టిన ఒక సిక్స్ స్టేడియం పైకప్పుని తాకింది. (AP)
(14 / 15)
భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులకి ఆలౌటవగా.. న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యం నిలిచింది. మ్యాచ్‌లో ఇంకా ఆదివారం ఆట మిగిలి ఉంది. (PTI)
ఇతర గ్యాలరీలు