Home Remedies for Dandruff : ఇంట్లోనే సులభంగా చుండ్రును ఇలా వదలించుకోండి..-home remedies for dandruff you must try at home ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Home Remedies For Dandruff : ఇంట్లోనే సులభంగా చుండ్రును ఇలా వదలించుకోండి..

Home Remedies for Dandruff : ఇంట్లోనే సులభంగా చుండ్రును ఇలా వదలించుకోండి..

Jan 21, 2023, 09:30 PM IST Geddam Vijaya Madhuri
Jan 21, 2023, 09:30 PM , IST

  • Home Remedies for Dandruff : మీరు ఇంటి నివారణలతో చుండ్రు సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఇప్పటివరకు మీరు ప్రయత్నించినవన్నీ.. మీకు చుండ్రు మీద ప్రభావం చూపించకపోతే.. మీరు కచ్చితంగా ట్రై చేయవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో చుండ్రు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు మీ జుట్టును బ్రష్ చేసినప్పుడు అది మంచులా వస్తుంది. పైగా ఇది బాగా దురద పెడుతుంది. జుట్టు రాలిపోయేలా చేస్తుంది.

(1 / 8)

చలికాలంలో చుండ్రు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు మీ జుట్టును బ్రష్ చేసినప్పుడు అది మంచులా వస్తుంది. పైగా ఇది బాగా దురద పెడుతుంది. జుట్టు రాలిపోయేలా చేస్తుంది.

అనేక షాంపూలు, కండిషనర్లు ఉపయోగించిన తర్వాత కూడా మీరు ఈ చుండ్రు సమస్యను వదిలించుకోకపోతే.. మీరు కొన్ని ఇంటి నివారణలతో సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. మీరు చుండ్రును వదిలించుకోవడానికి వివిధ నూనెలు లేదా సౌందర్య సాధనాల నుంచి సహాయం పొందకపోతే.. ఈ హోం రెమెడీ మీకు శీఘ్ర పరిష్కారాన్ని ఇస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

(2 / 8)

తలకు కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోదు. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. తర్వాత వేడిచేసిన కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి 10-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. 

(3 / 8)

తలకు కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోదు. ముందుగా కొబ్బరి నూనెను వేడి చేయాలి. తర్వాత వేడిచేసిన కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. దీన్ని తలకు పట్టించి 10-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. (Pixabay)

చుండ్రు సమస్య హెలాఫెల్ సమస్య కాదు. కాబట్టి అలాంటి సమస్య వస్తే జాగ్రత్తగా ఉండండి. వేప ఆకులను వేడి నీటిలో మరిగించి.. ఆ నీటిని మీ తలపై పోయాలి. ఇలా వారానికి కనీసం 2 రోజులు చేస్తే చుండ్రు సమస్య పోతుంది.

(4 / 8)

చుండ్రు సమస్య హెలాఫెల్ సమస్య కాదు. కాబట్టి అలాంటి సమస్య వస్తే జాగ్రత్తగా ఉండండి. వేప ఆకులను వేడి నీటిలో మరిగించి.. ఆ నీటిని మీ తలపై పోయాలి. ఇలా వారానికి కనీసం 2 రోజులు చేస్తే చుండ్రు సమస్య పోతుంది.(Freepik)

చుండ్రు తలపై అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. జుట్టును కూడా దెబ్బతీస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని పెంచుతుంది. అందుకే స్నానం చేసే ముందు ఒక గిన్నెలో నిమ్మరసం, పెరుగు కలపాలి. 1 గంట పాటు తలపై ఉంచండి. చివరగా స్నానం చేసి షాంపూతో కడగాలి.

(5 / 8)

చుండ్రు తలపై అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా.. జుట్టును కూడా దెబ్బతీస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని పెంచుతుంది. అందుకే స్నానం చేసే ముందు ఒక గిన్నెలో నిమ్మరసం, పెరుగు కలపాలి. 1 గంట పాటు తలపై ఉంచండి. చివరగా స్నానం చేసి షాంపూతో కడగాలి.(Freepik)

ఒక చెంచా అలోవెరా జెల్‌ను ఆముదంతో కలపండి. తలస్నానానికి ముందు దీన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత మీ జుట్టును కడగాలి. మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు.

(6 / 8)

ఒక చెంచా అలోవెరా జెల్‌ను ఆముదంతో కలపండి. తలస్నానానికి ముందు దీన్ని తలకు పట్టించాలి. అరగంట తర్వాత మీ జుట్టును కడగాలి. మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు.

మీరు బిజీ షెడ్యూల్‌లో ఉంటూ చుండ్రును సులభంగా వదిలించుకోవాలనుకుంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం కలపండి. ఆ నూనెను తలకు పట్టించి.. కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది.

(7 / 8)

మీరు బిజీ షెడ్యూల్‌లో ఉంటూ చుండ్రును సులభంగా వదిలించుకోవాలనుకుంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం కలపండి. ఆ నూనెను తలకు పట్టించి.. కాసేపటి తర్వాత తలస్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది.

మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి అందులో కొంచెం అలోవెరా జెల్ కలపండి. తర్వాత మీ తలపై అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రుకు బ్రేక్ పడుతుంది.

(8 / 8)

మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే గింజలను గ్రైండ్ చేసి అందులో కొంచెం అలోవెరా జెల్ కలపండి. తర్వాత మీ తలపై అప్లై చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రుకు బ్రేక్ పడుతుంది.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు