
(1 / 8)
ఉత్తరాన బృందావన్ నుంచి దక్షిణాన హంపి వరకు, భారతదేశంలో హోలీ వేడుకలను ఆనందించడానికి భారతదేశంలో కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఇక్కడ చూడండి.
(PTI)
(2 / 8)
ఉదయపూర్: ఉదయపూర్‌లోని హోలీ వేడుకలు వాటి రాచరికపు ఆకర్షణకు ప్రసిద్ధి చెందాయి. ఉదయపూర్ మహారాజు కూడా ఉత్సవాల్లో పాల్గొంటారు.
(Unsplash)
(3 / 8)
బర్సానా: ఉత్తరప్రదేశ్‌లోని ఈ చిన్న పట్టణం లాత్‌మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ గోపికలతో కృష్ణ భగవానుడు సరదాగా గడిపిన విషయాన్ని గుర్తుచేసుకోవడానికి స్త్రీలు పురుషులను కర్రలతో సరదా కొడుతూ హోలీ ఆటలు ఆడతారు.
(Unsplash)

(4 / 8)
హంపి: కర్ణాటకలోని పురాతన నగరం హంపి హోలీ వేడుకలకు ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ప్రజలు రంగులతో ఆడుకోవడంతో పాటు సాంప్రదాయ సంగీతం, నృత్య ప్రదర్శనలలోనూ పాలుపంచుకుంటారు.
(Unsplash)
(5 / 8)
జైపూర్: జైపూర్‌లో హోలీ వేడుకలను "ఎలిఫెంట్ ఫెస్టివల్" అని పిలుస్తారు, ఇక్కడ ఏనుగులకు రంగులు వేసి, అందంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళతారు.
(Unsplash)
(6 / 8)
శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్‌లోని ఈ చిన్న పట్టణంలో నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విశ్వవిద్యాలయం ఉంది. ఇక్కడ హోలీ వేడుకలను బసంత ఉత్సవ్ అని పిలుస్తారు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి హోలీ రోజున పసుపు వస్త్రాలు ధరించి సంగీతం, నృత్యం, కవిత్వం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
(Unsplash)
(7 / 8)
ఢిల్లీ: ఢిల్లీలో హోలీ వేడుకలు కలర్‌ఫుల్‌గా, ఉత్సాహంగా సాగుతాయి, ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ, సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తారు.
(Unsplash)

(8 / 8)
మధుర, బృందావనం: ఇవి శ్రీకృష్ణుని జన్మస్థలాలు, ఇక్కడ హోలీ వేడుకలు పురాణగాథలను స్పృశిస్తాయి. ఉత్సవాల్లో పాల్గొనడానికి భారతదేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వస్తారు.
(Unsplash)ఇతర గ్యాలరీలు