Ugadi 2024: కొత్త ఏడాది ఉగాది రోజున చేయాల్సిన పూజా విధానం ఇదిగో-here is the pooja procedure to be performed on ugadi day ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ugadi 2024: కొత్త ఏడాది ఉగాది రోజున చేయాల్సిన పూజా విధానం ఇదిగో

Ugadi 2024: కొత్త ఏడాది ఉగాది రోజున చేయాల్సిన పూజా విధానం ఇదిగో

Apr 05, 2024, 12:42 PM IST Haritha Chappa
Apr 05, 2024, 12:42 PM , IST

  • Ugadi 2024: హిందూ నూతన సంవత్సరమైన ఉగాదిని తెలుగు రాష్ట్రాలో ఆనందంగా నిర్వహించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉగాది పండుగ వచ్చింది.  ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటో,  ఆ రోజు ఎలా పూజ చేయాలో తెలుసుకోండి.

ఉగాదిని హిందూ చాంద్రమాన క్యాలెండర్ లోని చైత్ర మాసం మొదటి రోజున నిర్వహించుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 9 న ఉగాది వచ్చింది. ఉగాది పండుగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. దీనిని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్,  తెలంగాణలో ఉగాది పండుగ అని పిలుస్తారు. మహారాష్ట్ర, డయ్యూ డామన్ లలో గుడి పడ్వా అని పిలుస్తారు. 

(1 / 9)

ఉగాది ఒక నూతన శకానికి నాంది పలుకుతుంది. శోభాకృత నామ సంవత్సరం ముగిసిపోతోంది. ఉగాది రోజు నుండి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ  హిందూ పురాణాల ప్రకారం, ఉగాది పండుగ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. ఇది వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగ. ఉగాది వచ్చినప్పుడు మొక్కలు, చెట్లు అందంగా చిగుర్లు పెరుగతాయి.

(2 / 9)

ఉగాది పండుగకు రెండు, మూడు రోజుల ముందు నుంచే ఈ పండుగకు సన్నాహాలు ప్రారంభమవుతాయి.ఈ పండుగ కోసం ఇంటిని పూర్తిగా శుభ్రపరుచుకోవాలి. పండుగ రోజున మామిడి ఆకులు, పూలతో తోరణాలు కట్టాలి. ఇంటి ముందు రంగురంగుల రంగోలీలు గీయాలి. స్వస్తిక్ చిహ్నాన్ని కచ్చితంగా గీయాలి.

(3 / 9)

పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం శుభప్రదమని నమ్ముతారు. శనగపిండిని శరీరానికి రాసుకుని నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఇంటిని, పరిసరాలను ఆవు పేడతో శుభ్రం చేయాలి.

(4 / 9)

ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి.  దీన్ని తినే ముందు సూర్యభగవానునికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. 

(5 / 9)

ఉగాది రోజు విష్ణువును పూజిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజున విష్ణువుకు, బ్రహ్మదేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరువాత,  చేతుల్లో పువ్వులు, అక్షితలు, గంధం, నీరు పట్టుకుని బ్రహ్మదేవుని మంత్రాలను జపించాలి.

(6 / 9)

కార్తికేయుడు, వినాయకుడు సౌభాగ్యాలకు, శ్రేయస్సుకు దేవుళ్లుగా భావిస్తారు. అందువల్ల ఈ దేవతలకు ప్రీతిపాత్రమైన మామిడి తోరణాన్ని ఇంటి గుమ్మానికి అలంకరించాలి. ఇంటి దైవమైన కులదేవుడిని ఈ రోజున పూజిస్తే మంచిది.

(7 / 9)

కార్తికేయుడు, వినాయకుడు సౌభాగ్యాలకు, శ్రేయస్సుకు దేవుళ్లుగా భావిస్తారు. అందువల్ల ఈ దేవతలకు ప్రీతిపాత్రమైన మామిడి తోరణాన్ని ఇంటి గుమ్మానికి అలంకరించాలి. ఇంటి దైవమైన కులదేవుడిని ఈ రోజున పూజిస్తే మంచిది.(PC: Canva)

ఉగాది సందర్భంగా భక్తులు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సౌభాగ్యం, విజయం కోసం భగవంతుని ఆశీస్సులు పొందుతారు. దేవాలయాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కొందరు ఈ రోజున తమ కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. మొత్తం మీద ఏ శుభకార్యానికైనా ఈ రోజు అనువైనది. 

(8 / 9)

ఉగాది రోజున ప్రత్యేక వంటకం పచ్చడి తయారు చేస్తారు. పచ్చడిని తయారు చేసి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి పంచుతారు. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు