(1 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలహీన పడిందని ఐఎండీ పేర్కొంది.దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది.
(2 / 6)
ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం… పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(3 / 6)
ఇవాళ(సెప్టెంబర్ 26) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(4 / 6)
రేపు(సెప్టెంబర్ 27) ఆదిలాబాద్, ఆసిఫాబూాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(5 / 6)
సెప్టెంబర్ 28వ తేదీ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
(6 / 6)
ఏపీలోని శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,అనకాపల్లి,మన్యం, అల్లూరి,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు