తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Report : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం…! ఏపీకి భారీ వర్ష సూచన, హెచ్చరికలు జారీ
- AP Telangana Weather Updates: బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. రేపట్నుంచి ఏపీలోని కోస్తాంధ్ర, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 7)
బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. రేపటి (సోమవారం) నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 7)
అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
(3 / 7)
ఈ ప్రభావంతో ఇవాళ(ఆదివారం) కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 7)
ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర,రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
(5 / 7)
ఇవాళ(అక్టోబర్ 13) అల్లూరి,మన్యం,కోనసీమ, తూగో,పగో, ఏలూరు,కృష్ణా, గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు, నంద్యాల,అనంతపురం,శ్రీ సత్యసాయి,వైఎస్ఆర్,అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(6 / 7)
తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు