Telangana Rains : తెలంగాణకు IMD అలర్ట్ - ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు..! 9వ తేదీ వరకు హెచ్చరికలు
- Telangana Rains : తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
- Telangana Rains : తెలంగాణలో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
(1 / 6)
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ను విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.
(2 / 6)
బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… ఇవాళ కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(3 / 6)
రేపు (గురువారం - సెప్టెంబర్ 5) భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది.
(4 / 6)
మరోవైపు గురువారం(రేపు) ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో భారరీ వర్షాలు పడుతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(5 / 6)
రేపటికి పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతోనే మరో నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.
(6 / 6)
సెప్టెంబర్ 4 నుండి 9 వరకు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై జీహెచ్ఎంసీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. వాతావరణశాఖ అందించే సమాచారాన్ని, స్థానిక వాతావరణ నిపుణులు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో అటువైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రోడ్లపై నడిచేప్పుడు మ్యాన్ హోల్స్ ను చూసుకోని నడవాలని సూచించారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం GHMC కంట్రోల్ రూమ్ నంబర్ 040-21111111కి లేదా DRF 9000113667 కి కాల్ చేయాలని పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు