AP TG Weather Updates : తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు, తాజా బులెటిన్ వివరాలు
- AP Telangana Weather Updates :తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. పలు జిల్లాలలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి తేలకపాటి వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం పేర్కొంది.
(2 / 6)
శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(3 / 6)
రేపు(సెప్టెంబర్ 28) భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 6)
సెప్టెంబర్ 29వ తేదీన భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
సెప్టెంబర్ 30వ తేదీ తర్వతా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వెల్లడించింది.
(6 / 6)
ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(Imahe Source From @APSDMA)
ఇతర గ్యాలరీలు