Weather Report : తెలంగాణకు ఐఎండీ అలర్ట్ - ఈ నెల 20, 21 తేదీల్లో భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP TG Weather News : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు షురూ కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 2 రోజులపాటు ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(2 / 6)
సెప్టెంబర్ 20వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. (image source from @APSDMA)
(3 / 6)
సెప్టెంబర్ 21వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 6)
సెప్టెంబర్ 22వ తేదీ నుంచి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే కురుస్తాయని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
(5 / 6)
ఇవాళ(సెప్టెంబర్ 18) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు