TG Weather Updates : అల్పపీడనం ఎఫెక్ట్ - మరో 3 రోజులు భారీ వర్షాలు..! ఈ 8 జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు
- Telangana Rains : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాలను పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 28వ తేదీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. బంగాఖాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
(2 / 6)
తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
(3 / 6)
ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(4 / 6)
రేపు (సెప్టెంబర్ 26) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
(5 / 6)
సెప్టెంబర్ 27వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి,ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28వ తేదీ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇతర గ్యాలరీలు