పీరియడ్స్‌ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుందా?అయితే ఈ చిట్కాలు పాటించండి!-heavy bleeding periods and how you can stop them ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  పీరియడ్స్‌ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుందా?అయితే ఈ చిట్కాలు పాటించండి!

పీరియడ్స్‌ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుందా?అయితే ఈ చిట్కాలు పాటించండి!

HT Telugu Desk HT Telugu
Jun 24, 2022 11:23 PM IST

పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళల్లో అధిక రక్త స్త్రావం ఉంటుంది. రక్తస్రావం ఎక్కువగా జరగడం వల్ల తొందరగా అనారోగ్యానికి గురవుతారు. మరీ అధిక రక్త స్రావాన్ని తగ్గించాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్నుడు తెలుసుకుందాం

bleeding in periods time
bleeding in periods time

ఋతు చక్రం అనేది ప్రతి నెల మహిళల్లో వచ్చే సాధరణ ప్రక్రియ, మహిళలకు సాధారణంగా ప్రతి నెల 28 రోజుల తర్వాత రుతుక్రమం వస్తుంది, ఇది 7 రోజుల పాటు కొనసాగుతుంది. కొంతమంది స్త్రీలు వారి రుతుక్రమం ప్రారంభ రోజులలో అధిక రక్తస్రావం ఉంటుంది. రక్తస్రావం కారణంగా రోజుకు 2-3 ప్యాడ్లు మార్చవలసి ఉంటుంది, కొంత మంది రోజుకు 5-7 ప్యాడ్ల కూడా మార్చవలసి ఉంటుంది. మహిళల్లో అధిక రక్తస్రావం శరీరాన్ని బలహీనపరచడమే కాకుండా అనేక సమస్యలను సృష్టిస్తుంది.

ఎక్కువగా ప్యాడ్‌లను మార్చవలసి వస్తే.. పీరియడ్స్ వారం కంటే ఎక్కువ ఉంటే, అది భారీ రక్తస్రావంగా పరిగణించాలి. ఫైబ్రాయిడ్లు, నియోప్లాజమ్‌లు, ట్యూమర్‌ల వంటి వ్యాధులు పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం కలిగిస్తాయి. ఇవి కాక భారీ రక్తస్రావానికి అనేక కారణాలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా కావచ్చు. కొన్నిసార్లు, అండోత్సర్గము లేకపోవడం వల్ల, హార్మోన్ల సమతుల్యత భారీ రక్తస్రావం సంభవించవచ్చు. మీకు కూడా అధిక రక్తస్రావం సమస్యతో బాధపడుతుంటే, ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా సులువుగా సమస్య తగ్గించుకొవచ్చు.

ఆవపిండితో అధిక రక్తస్రావం చికిత్స: మీకు అధిక రక్తస్రావం ఉంటే, ఆవాలు తీసుకోవాలి. వాటిని తినడం వల్ల రక్తస్రావం తగ్గుతుంది. ఆవాలు మెత్తగా, పొడిగా చేసి ఆ పోడిని గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే అధిక రక్తస్రావం అదుపులో ఉంటుంది.

సోపు నీటిని సేవించండి: అధిక రక్తస్రావం సోపును తీసుకోవడం ద్వారా నియంత్రించబడుతుంది. సోపు గ్రైండ్ చేసి ముతక పొడిని తయారు చేసి, ఒక కప్పు నీటిలో మరిగించాలి. కాసేపు మరిగించిన తర్వాత ఈ నీటిని వడకట్టి సేవిస్తే అధిక రక్తస్రావం అదుపులో ఉంటుంది.

ఐస్ ట్యూబ్స్: భారీ రక్తస్రావం ఉన్నట్లయితే, కడుపు దిగువ భాగాన్ని ఐస్ ట్యూబ్స్‌ను ఉంచండి. ఒక టవల్‌లో కొన్ని మంచు ముక్కలను వేసి, దానితో పొత్తికడుపు కింది భాగాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి, రక్తస్రావం తక్కువగా ఉంటుంది.

మెంతి నీరు త్రాగండి: మీకు ఎక్కువ రక్తస్రావం అవుతుంటే మెంతికూర నీరు త్రాగండి. మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఉడికిన తర్వాత నీటిని ఫిల్టర్ చేసి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి గోరువెచ్చగా తాగాలి. రోజుకు రెండు మూడు గ్లాసుల మెంతికూర నీరు తాగితే రక్తస్రావం తగ్గుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్