తెలుగు న్యూస్ / ఫోటో /
High Uric Acid Level । చలికి శరీరంలో యూరిక్ ఆసిడ్ పెరగొచ్చు.. ఈ గింజలు తినండి!
- High Uric Acid Levels Reducing Nuts: చలికాలంలో శరీరంలో యూరిక్ ఆసిడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య, కీళ్లలో తీవ్రమైన నొప్పి, మంటను కలిగిస్తుంది.- దీని నివారణ ఇక్కడ చూడండి.
- High Uric Acid Levels Reducing Nuts: చలికాలంలో శరీరంలో యూరిక్ ఆసిడ్ అనేది ఎక్కువ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య, కీళ్లలో తీవ్రమైన నొప్పి, మంటను కలిగిస్తుంది.- దీని నివారణ ఇక్కడ చూడండి.
(1 / 8)
యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. ఇది ఆహారం జీర్ణక్రియ నుండి ఉత్పత్తి అవుతుంది. కిడ్నీ మన శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి తర్వాత మూత్రం ద్వారా శరీరం నుండి తొలగిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉత్పత్తి జరిగితే ఈ యూరిక్ యాసిడ్, రక్తంలో కలిసి ప్రవహించడం ప్రారంభమవుతుంది, ఇది శరీరంలోని అనేక భాగాలకు వ్యాపిస్తుంది. దీంతో అనేక సమస్యలు తలెత్తుతాయి.
(2 / 8)
చలికాలంలో నట్స్, సీడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇవి శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగించడమే కాకుండా, యూరిక్ ఆసిడ్ ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
(3 / 8)
జీడిపప్పులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. రోజూ 2 -3 జీడిపప్పులు తింటే చాలు.
(4 / 8)
వాల్‌నట్‌లను సూపర్‌ఫుడ్స్ అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీని వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి అదుపులో ఉంటుంది.
(5 / 8)
బాదంపప్పు మెదడుకు పదును పెట్టడమే కాకుండా యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి, ఇవి యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి.
(6 / 8)
బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్రెజిల్ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల థైరాయిడ్, శారీరక మంట, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు.
(7 / 8)
అవిసె గింజలలో మన శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం చాలా వరకు తగ్గుతుంది.
ఇతర గ్యాలరీలు