తెలుగు న్యూస్ / ఫోటో /
Lotus Seeds Benefits । తామర గింజల్లో పోషకాలు పుష్కలం, ప్రయోజనాలు అధికం!
- Lotus Seeds Benefits: మఖానా, ఫాక్స్ గింజలు లేదా తామర గింజలు వివిధ పేర్లతో పిలిచే ఈ విత్తనాలు ఒక సాంప్రదాయ భారతీయ చిరుతిండి. చూడటానికి పాప్‌కార్న్‌లా ఉండే ఈ విత్తనాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- Lotus Seeds Benefits: మఖానా, ఫాక్స్ గింజలు లేదా తామర గింజలు వివిధ పేర్లతో పిలిచే ఈ విత్తనాలు ఒక సాంప్రదాయ భారతీయ చిరుతిండి. చూడటానికి పాప్‌కార్న్‌లా ఉండే ఈ విత్తనాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
(1 / 6)
మఖానా అనేది యూరియాల్ ఫెరోక్స్ అంటే తామర మొక్కల నుండి సేకరించే విత్తనాలు. ఇవి పోషకాలకు పవర్‌హౌస్ లాంటివి. వీటిలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. వీటిని అనేక సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యలు, దీర్ఘకాలిక విరేచనాలు, అధిక ల్యుకోరియా , ప్లీహము హైపోఫంక్షన్‌తో సహా వివిధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు కూడా.(HT File Photo)
(2 / 6)
మఖానాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఆరోగ్యకరమైన చిరుతిండి మీ ఆహార కోరికలను తగ్గిస్తుంది, మీ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.(Shutterstock)
(3 / 6)
మఖానాలో యాంటీ ఏజింగ్ గుణాలకు ప్రసిద్ధి చెందిన అనేక అమైనో ఆమ్లాలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి తింటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.(Pixabay )
(4 / 6)
మఖానాలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి.(HT File Photo)
(5 / 6)
మఖానాలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలు, మృదులాస్థి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ఎముకలను దృఢంగా ఉంచడంలో పోషకాలు అందిస్తుంది.(Twitter/Orthocore256)
ఇతర గ్యాలరీలు