తెలుగు న్యూస్ / ఫోటో /
HanuMan Jayanti 2024: ఈసారి హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనుగోలు చేయకండి!
HanuMan Jayanti 2024: హనుమాన్ జయంతి పర్వదినం రేపు (ఏప్రిల్ 23, మంగళవారం) ఉండనుంది. ఈ మంగళవారం వచ్చిన ఈ విశిష్టమైన రోజున శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయకూడదు. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 6)
హనుమాన్ జయంతిని ఏప్రిల్ 23వ తేదీ అయిన మంగళవారం జరుపుకోనున్నాం. ఆరోజున హనుమంతుడిని ఆరాధించడంతో పాటు ఉపవాసం ఉంటే మంచిది. ఈసారి హనుమాన్ జయంతి మంగళవారం రావడం మరింత విశేషంగా ఉంది. ఆరోజున ఆంజనేయుడిని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉంటుంది.
(2 / 6)
హనుమంతుడిని ఆరాధించి ప్రసన్నం చేసుకునేందుకు మంగళవారం చాలా ముఖ్యమైన రోజు. శాస్త్రాల ప్రకారం, ఆరోజున కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. అందుకే, ఈసారి హనుమాన్ జయంతి వచ్చిన మంగళవారం (ఏప్రిల్ 22) కూడా ఏ వస్తువులను కొనుగోలు చేయకూడదో ఇక్కడ చూడండి.
(3 / 6)
నలుపు దుస్తులు: శాస్త్రాల ప్రకారం, మంగళవారం రోజున పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులను కొనకూడదు. అలాగే, మంగళవారం రోజున, హనుమాన్ జయంతి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు.
(4 / 6)
వివాహమైన మహిళలు మంగళవారం రోజున అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం మంచిది కాదు. అలా చేస్తే.. వైవాహిక జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉంటుందనే నమ్మకం ఉంటుంది.
(5 / 6)
మంగళవారం హనుమాన్ జయంతి రోజున ఇనుము, గాజు సామాగ్రిని ఎక్కువగా కొనుగోలు చేయకూడదు. మంగళవారం అలాంటి కొత్త వస్తువులను తీసుకురాకూడదు. ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
ఇతర గ్యాలరీలు