Gujarat Elections 2022 Results: బీజేపీ శ్రేణుల సంబరాలు మొదలు.. అదిరిపోయేలా..-gujarat elections 2022 results bjp celebration starts as party historic win ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gujarat Elections 2022 Results: బీజేపీ శ్రేణుల సంబరాలు మొదలు.. అదిరిపోయేలా..

Gujarat Elections 2022 Results: బీజేపీ శ్రేణుల సంబరాలు మొదలు.. అదిరిపోయేలా..

Jan 08, 2024, 09:59 PM IST Chatakonda Krishna Prakash
Dec 08, 2022, 01:30 PM , IST

  • Gujarat Elections 2022 Results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే.. భారతీయ జనతా పార్టీ (BJP) విజయం దాదాపు ఖాయమైపోయింది. కమలం పార్టీకి బంపర్ మెజార్టీ తథ్యమైంది. మునుపటి కంటే ఎక్కువ సీట్లను కషాయ పార్టీ దక్కించుకోనుంది. గుజరాత్‍లో వరుసగా ఏడోసారి గెలిచేందుకు సిద్ధమైంది. దీంతో ఓవైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్నా.. గుజరాత్‍లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాషాయ జెండాలను రెపరెపలాడిస్తున్నారు. నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. వివరాలను చూడండి.

గాంధీనగర్ లోని పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. డ్యాన్సులు చేస్తున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ వరుసగా ఏడోసారి గెలవటంతో పట్టరాని ఆనందంతో ఉన్నారు.

(1 / 5)

గాంధీనగర్ లోని పార్టీ ఆఫీస్ ముందు సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. డ్యాన్సులు చేస్తున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ వరుసగా ఏడోసారి గెలవటంతో పట్టరాని ఆనందంతో ఉన్నారు.

అహ్మదాబాద్‍లోని పార్టీ కార్యాలయంలోనూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. మోదీ నినాదాలతో గుజరాత్ హోరెత్తుతోంది.

(2 / 5)

అహ్మదాబాద్‍లోని పార్టీ కార్యాలయంలోనూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. మోదీ నినాదాలతో గుజరాత్ హోరెత్తుతోంది.(PTI)

బీజేపీ గెలుపుతో అహ్మదాబాద్‍లోని పార్టీ ఆఫీస్‍లో మహిళా కార్యకర్తలు సంప్రదాయ నృత్యం చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

(3 / 5)

బీజేపీ గెలుపుతో అహ్మదాబాద్‍లోని పార్టీ ఆఫీస్‍లో మహిళా కార్యకర్తలు సంప్రదాయ నృత్యం చేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. (PTI)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి వల్లే బీజేపీ మళ్లీ గెలిచిందని గాంధీనగర్ బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ వాఘేలా అన్నారు. గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

(4 / 5)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి వల్లే బీజేపీ మళ్లీ గెలిచిందని గాంధీనగర్ బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ వాఘేలా అన్నారు. గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుత గణాంకాల ప్రకారం, గుజరాత్‍లోని 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 2017 ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచిన కషాయ పార్టీ.. ఈసారి అంత కంటే చాలా అధికంగా రికార్డు స్థాయి నియోజకవర్గాలను దక్కించుకోవడం ఖాయమైంది. సాయంత్రంలోగా మొత్తం ఫలితాలు వస్తాయి. 

(5 / 5)

ప్రస్తుత గణాంకాల ప్రకారం, గుజరాత్‍లోని 154 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 2017 ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచిన కషాయ పార్టీ.. ఈసారి అంత కంటే చాలా అధికంగా రికార్డు స్థాయి నియోజకవర్గాలను దక్కించుకోవడం ఖాయమైంది. సాయంత్రంలోగా మొత్తం ఫలితాలు వస్తాయి. (PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు