Hyderabad : ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. జీహెచ్ఎంసీ అధికారుల వినూత్న ఆలోచన!-ghmc officials are constructing playground under flyover in hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad : ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. జీహెచ్ఎంసీ అధికారుల వినూత్న ఆలోచన!

Hyderabad : ఫ్లైఓవర్ కింద ప్లే గ్రౌండ్.. జీహెచ్ఎంసీ అధికారుల వినూత్న ఆలోచన!

Nov 04, 2024, 12:58 PM IST Basani Shiva Kumar
Nov 04, 2024, 12:58 PM , IST

  • Hyderabad : హైదరాబాద్.. ఇరుకైన రోడ్లు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్. నిత్యం ప్రయాణికులకు నరకం కనిపిస్తుంది. రద్దీని తగ్గించడానికి ఫ్లైఓవర్ల నిర్మాణం చేశారు. అయితే.. వాటి కింద ఖాళీ స్థలాన్ని వినియోగించుకోవడానికి జీహెచ్ఎంసీ ఇప్పుడు కొత్త ఆలోచన చేసింది. ఫ్లైఓవర్ల కింద ప్లే గ్రౌండ్‌లను నిర్మిస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది. కేపీహెచ్‌బీ ఫ్లైఓవర్ కింద.. నగరంలో మొట్టమొదటి సారిగా క్రీడా రంగాన్ని ఏర్పాటు చేసింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్‌తో సహా వివిధ క్రీడలు ఆడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తోంది.

(1 / 5)

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వినూత్న ఆలోచన చేసింది. కేపీహెచ్‌బీ ఫ్లైఓవర్ కింద.. నగరంలో మొట్టమొదటి సారిగా క్రీడా రంగాన్ని ఏర్పాటు చేసింది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. బాస్కెట్‌బాల్, స్కేటింగ్, బ్యాడ్మింటన్, క్రికెట్‌తో సహా వివిధ క్రీడలు ఆడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తోంది.(@Kavalichandrak1)

ఈ బహుళార్ధసాధక క్రీడా ప్రాంగణాన్ని.. రూ.78 లక్షల వ్యయంతో ఫ్లైఓవర్ కింద నిర్మిస్తున్నారు. ఇదే కాదు.. త్వరలో ఇలాంటి మరిన్ని ప్రాంగణాల నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. హైటెక్ సిటీ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్‌ల కింద కూడా ఇలాంటి ఇలాంటివి ఏర్పాటు చేయడానికి అడుగులు పడుతున్నాయి.

(2 / 5)

ఈ బహుళార్ధసాధక క్రీడా ప్రాంగణాన్ని.. రూ.78 లక్షల వ్యయంతో ఫ్లైఓవర్ కింద నిర్మిస్తున్నారు. ఇదే కాదు.. త్వరలో ఇలాంటి మరిన్ని ప్రాంగణాల నిర్మాణాలకు ప్లాన్ చేస్తున్నారు. హైటెక్ సిటీ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్‌ల కింద కూడా ఇలాంటి ఇలాంటివి ఏర్పాటు చేయడానికి అడుగులు పడుతున్నాయి.(@Kavalichandrak1)

అయితే.. ఫ్లైఓవర్ల కింద ఇలాంటి నిర్మాణాలను నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లలో ఇలాంటివి ఏర్పాటు చేస్తే.. ప్రజలు ఆ ప్రాంతంలో గుమిగూడతారని అంటున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు. 

(3 / 5)

అయితే.. ఫ్లైఓవర్ల కింద ఇలాంటి నిర్మాణాలను నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. రద్దీగా ఉండే రోడ్లలో ఇలాంటివి ఏర్పాటు చేస్తే.. ప్రజలు ఆ ప్రాంతంలో గుమిగూడతారని అంటున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు. (@Kavalichandrak1)

రోడ్ల మధ్యలో ఇలాంటివి ఉంటే.. వాహనదారులు ఇంట్రెస్ట్ డైవర్ట్ అవుతుందని.. దీంతో ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

(4 / 5)

రోడ్ల మధ్యలో ఇలాంటివి ఉంటే.. వాహనదారులు ఇంట్రెస్ట్ డైవర్ట్ అవుతుందని.. దీంతో ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.(@Kavalichandrak1)

నగరంలో ఉన్న ఫ్లైఓవర్‌లను ప్రజల ప్రాణాలకు హాని కలిగించని కార్యకలాపాలకు వినియోగించాలని అర్బన్ ప్లానర్లు చెబుతున్నారు. ఏదైనా నిర్మాణ వైఫల్యం కారణంగా ఫ్లైఓవర్ కూలిపోతే.. దానికింద ఉండే క్రీడాకారుల ప్రాణాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. 

(5 / 5)

నగరంలో ఉన్న ఫ్లైఓవర్‌లను ప్రజల ప్రాణాలకు హాని కలిగించని కార్యకలాపాలకు వినియోగించాలని అర్బన్ ప్లానర్లు చెబుతున్నారు. ఏదైనా నిర్మాణ వైఫల్యం కారణంగా ఫ్లైఓవర్ కూలిపోతే.. దానికింద ఉండే క్రీడాకారుల ప్రాణాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. (@Kavalichandrak1)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు