తెలుగు న్యూస్ / ఫోటో /
Gary Kirsten: పాకిస్థాన్ హెడ్‍కోచ్‍గా గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా.. ఆరు నెలలకే గుడ్‍బై.. కారణం ఇదే
- Gary Kirsten - Pakistan Cricket: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసేశారు. ఆరు నెలకే ఆ స్థానాన్ని వీడారు. ఆ వివరాలు ఇవే..
- Gary Kirsten - Pakistan Cricket: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల హెడ్ కోచ్ పదవికి గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసేశారు. ఆరు నెలకే ఆ స్థానాన్ని వీడారు. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
పాకిస్థాన్ క్రికెట్‍లో అస్థిరత కొనసాగుతూనే ఉంది. పాక్ వన్డే, టీ20లకు హెడ్ కోచ్‍గా ఉన్న దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ రాజీనామా చేసేశారు. ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు పాక్ బోర్డు జట్లను ప్రకటించిన 24 గంటల్లోనే ఈ పరిణామం జరిగింది.
(2 / 5)
ఈ ఏడాది ఏప్రిల్‍లోనే పాకిస్థాన్ పరిమిత ఓవర్ల (వన్డే, టీ20) జట్లకు హెడ్‍కోచ్‍గా కిర్‌స్టన్ నియమితుడయ్యాడు. అయితే, ఆరు నెలలు తిరగకుండానే ఆ పదవికి ఇప్పుడు రాజీనామా చేసి వీడ్కోలు పలికాడు.
(3 / 5)
జట్టు కోసం కొన్ని నిర్ణయాల విషయంలో గ్యారీ కిర్‌స్టన్‍కు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతినిధులకు మధ్య వాగ్వాదం జరిగినట్టు కొన్ని రిపోర్టులు వచ్చాయి. పీసీబీతో కిర్‌స్టన్ ఏకీభవించలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే హెడ్ కోచ్ పదవికి ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
(4 / 5)
కిర్‌స్టన్ రాజీనామా చేయడంతో వన్డే, టీ20 జట్ల బాధ్యతలను కూడా తాత్కాలికంగా.. టెస్టు టీమ్ హెడ్‍కోచ్ జేసన్ గెలెస్పీకి పీసీబీ అప్పగించింది. ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల్లో పాక్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు కూడా గెలెస్పీ హెడ్‍కోచ్‍గా వ్యవహరించనున్నాడు.
(5 / 5)
పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్‍కోచ్‍గా గెలెస్పీ ఉన్నాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో పాకిస్థాన్ టెస్టు సిరీస్ ఓడింది. అయితే, ఇటీవల ఇంగ్లండ్‍పై సిరీస్ గెలిచింది. ఇప్పటికైతే టీ20లు, వన్డే జట్లకు తాత్కాలిక హెడ్‍కోచ్‍గా గెలెస్పీని పీసీబీ ప్రకటించింది. అయితే, అతడినే అన్ని ఫార్మాట్లకు కొనసాగిస్తుందా.. టెస్టులకే ఉంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేరే వాళ్లను నియమిస్తుందా అనేది చూడాలి. పీసీబీ తీరు పట్ల గెలెస్పీ కూడా పూర్తి సంతృప్తిగా లేరని తెలుస్తోంది.
ఇతర గ్యాలరీలు