తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Brahmotsavam 2023 : గరుడ వాహనంపై తిరుమల శ్రీవారు.. భక్తజనసంద్రమైన తిరుమాడ వీధులు
- Srivari Garuda Vahana Seva 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు. తిరుమాఢ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసోయాయి.
- Srivari Garuda Vahana Seva 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు వార్షికోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు. తిరుమాఢ వీధులన్నీ భక్తులతో కిక్కిరిసోయాయి.
(1 / 5)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు తిరుమల శ్రీవారు. శ్రీవారికి మూలవిరాట్ కు అలంకరించే సహస్ర నామాల మాల., లక్ష్మీ కాసుల మాల., పచ్చల హారం స్వామి వారికి అలంకరించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
(2 / 5)
దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు. అందుకే శ్రీవారిని గరుడ వాహనం రోజు దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు.
(3 / 5)
గరుడవ వాహన సేవ నేపథ్యంలో ఆలయ మాడవిధుల్లోని గ్యాలరీలు నిండు కుండలా మారిపోయాయి. గ్యాలరీలలో లక్ష మైందికి పైగా భక్తులు చేరుకున్నారు. తిరుమలలో ఎటు చూసినా భక్తుల కోలాహలమే కనిపిస్తోంది. ఆలయ మాడవిధుల్లోనూ., ఔటర్ రింగ్ రోడ్డులలోకి భక్తులు భారీ స్థాయిలో చేరుకున్నారు.
(4 / 5)
శుక్రవారం రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకూ గరుడ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి విహరిస్తారు. గరుడ వాహనంను దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ సేవలో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
(5 / 5)
గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిరంతరాయణంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. చంటి పిల్లలకోసం పాలను సైతం టీటీడీ గ్యాలరీలలో అందిస్తుంది. 3 లక్షలకు పైగా గరుడ వాహన సేవకు భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేసింది. ఈ ఏడాది మరింత మంది సామాన్య భక్తులకు గరుడ వాహన సేవ దర్శన భాగ్యం కల్పించేందుకు రీఫిల్లింగ్ వ్యవస్థను అందుబాటులోకి టీటీడీ తీసుకొచ్చింది. గరుడ సేవ సందర్భంగా గురువారం సాయంత్రం నుండి ద్విచక్ర వాహనాల అనుమతిని టిటిడి రద్దు చేసింది. గరుడ వాహనసేవకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే దృష్ట్యా 5 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన టిటిడి… కమాండ్ కంట్రోలు రూంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు అధికారులు.
ఇతర గ్యాలరీలు