Garmin Forerunner 965, 265: గార్మిన్ నుంచి రెండు ప్రీమియమ్ స్మార్ట్‌వాచ్‍లు లాంచ్
Garmin Forerunner 965, Forerunner 265: గార్మిన్ ఫోర్‌రన్నర్ 965, గార్మిన్ ఫోర్‌రన్నర్ 265 సిరీస్ స్మార్ట్‌వాచ్‍లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. భారత యువ అథ్లెట్ హిమా దాస్ ఈ లాంచ్ ఈవెంట్‍లో పాల్గొన్నారు. అమోలెడ్ డిస్‍ప్లే, జీపీఎస్ సహా అధునాతన ఫీచర్లతో ఈ ప్రీమియమ్ రేంజ్ స్మార్ట్‌వాచ్‍లు వచ్చాయి.
(1 / 6)
అధిక రెజల్యూషన్ ఉండే ఆకర్షణీయమైన అమోలెడ్ (AMOLED) డిస్‍ప్లే, మరింత ఇంటెరాక్టివ్‍గా ఉండే ఇంటర్ఫేస్‍ను ఈ గార్మిన్ ఫోర్‌రన్నర్ 965, గార్మిన్ ఫోర్‌రన్నర్ 265 స్మార్ట్‌వాచ్‍లు కలిగి ఉన్నాయి. ఫోర్‌రన్నర్ 965 మరింత ప్రీమియమ్ లుక్‍తో వచ్చింది.
(Garmin)(2 / 6)
గార్మిన్ ఫోర్‌రన్నర్ 965 స్మార్ట్‌వాచ్ 23 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. జీపీఎస్ మోడ్‍లో 31 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. గార్మిన్ ఫోర్‌రన్నర్ 265 వాచ్ 13 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. జీపీఎస్ మోడ్‍లో 20 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది.
(Garmin)(3 / 6)
మారథాన్, ట్రియాల్‍థాన్‍లలో పాల్గొనే వారికి ఈ స్మార్ట్‌వాచ్‍లు ఎక్కువగా సూటవుతాయి. ఇందుకోసం ప్రత్యేక ఫీచర్లు ఈ వాచ్‌ల్లో ఉంటాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ లాంటి హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్‍లు వచ్చాయి.
(Garmin)(4 / 6)
పరుగెడుతున్న సమయంలో త్వరగా అలసిపోకుండా శారీరక శ్రమను ఎలా మేనేజ్ చేసుకోవాలో ఈ గార్మిన్ ఫోర్‌రన్నర్ 965, గార్మిన్ ఫోర్‌రన్నర్ 265 సిరీస్ స్మార్ట్‌వాచ్‍ల్లోని అక్యుట్ క్రోనిక్ వర్క్ లోడ్ రేషియో తెలియజేస్తుంది. మారథాన్ లాంటి వాటిల్లో పాల్గొనే సమయాల్లో ఆ వాచ్‍లోని ఫీచర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
(Garmin)ఇతర గ్యాలరీలు