(1 / 6)
సీఎం జగన్ (Attck on CM Jagan)పై గుర్తుతెలియని వ్యక్తులు రాయితో దాడి చేసి సంగతి తెలిసిందే. వైద్యుల సూచనలతో ఒక రోజు విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్...ఇవాళ తిరిగి బస్సు యాత్ర(CM Jagan Bus Yatra) ప్రారంభించారు. కృష్ణా జిల్లా కేసరాపల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. రాళ్ల దాడితో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
(3 / 6)
ప్రజల ఆశీర్వాదం వల్లే రాళ్ల దాడి(Stones Pelting) నుంచి బయటపడ్డానని సీఎం జగన్ అన్నారు. వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఆదివారం బస్సు యాత్రకు విరామం ఇచ్చారు. సోమవారం ఉదయం కేసరాపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా నేతలు సీఎం జగన్‌ను పరామర్శించారు.
(4 / 6)
మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీర్వాదం ఉన్నాయని, ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని సీఎం జగన్(CM Jagan) అన్నారు. ఎవరూ అధైర్య పడవద్దని, ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దామన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.
(5 / 6)
వైసీపీ(Ysrcp) తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష ఆదరణ వస్తుందని, అది చూసి తట్టుకోలేక దాడికి పాల్పడ్డారని వైసీపీ నేతులు ఆరోపిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు