తెలుగు న్యూస్ / ఫోటో /
prevent blood clotting: శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే కొన్ని ఆహార పదార్థాలు!
- prevent blood clotting: శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి, ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అడ్డంకి ఏర్పడితే చాలా ప్రమాదం. మీ రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడేందుకు కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.
- prevent blood clotting: శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి, ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అడ్డంకి ఏర్పడితే చాలా ప్రమాదం. మీ రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడేందుకు కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.
(1 / 6)
మనం తినే ఆహారం మన రక్తప్రసరణ వ్యవస్థ పని చేసే విధానాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడే ఆహారాలను వివరించారు. (istock)
(2 / 6)
శరీరంలోపల మన రక్తం గడ్డకట్టే విధానం మనకు గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందో లేదో నిర్ణయిస్తుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రక్తాన్ని అంటుకునేలా చేస్తాయి. గడ్డలు కట్టి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. అయితే, కొన్ని ఆహారాలు రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, ఆ పదార్థాలేమిటో చూడండి. (istock)
(3 / 6)
ట్రీ-ఇయర్ మష్రూమ్‌లు వీటినే బ్లాక్ పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారు. ఇవి ప్రతిస్కందక లక్షణాలను కలిగి ఉంటాయి, శరీరంలో రక్తపు ప్లేట్‌లెట్లను ఒకదానికొకటి అంటుకోకుండా ఉంచడంలో సహాయపడతాయి. (Unsplash)
(4 / 6)
అల్లం, వెల్లుల్లి రక్తం గడ్డలను విడదీసే లక్షణాలను కలిగి ఉంటాయి, రక్తాన్ని పలుచగా ఉంచడంలో, గడ్డలను కరిగించడంలో సహాయపడతాయి (Unsplash)
(5 / 6)
ఉల్లిపాయలు మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే ఉల్లిలోని సమ్మేళనాలు ప్లేట్‌లెట్స్ అంటుకోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. (Unsplash)
ఇతర గ్యాలరీలు