(1 / 7)
మహిళల్లో చాలా మంది జుట్టు తరచూ మెరుపు కోల్పోయే సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వెంట్రుకలు నిర్జీవంగా మారుతుంటాయి. జుట్టు షైనింగ్ పెరిగేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఫాలో అయితే జుట్టు మెరుపు అధికం అవుతుంది. అవేంటో ఇక్కడ చూడండి.
(pixabay)(2 / 7)
కోడిగుడ్డు సొన: కోడిగుడ్డులోని పచ్చసొనలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు మేలు చేస్తాయి. పచ్చసొనను జుట్టుకు పట్టించి.. 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. దీంతో వెంట్రుకలకు సిల్కీగా ఉండటంతో పాటు మెరుపు పెరుగుతుంది.
(pixabay)(3 / 7)
కలబంద జెల్: జుట్టుకు కలబంద జెల్ చాలా మేలు చేస్తుంది. కలబంద మొక్క అందుబాటులో ఉంటే దాని ఆకులను సేకరించి జెల్‍ను బయటికి తీయవచ్చు. లేకపోతే మార్కెట్‍లోనూ దొరుకుతుంది. కలబంద (ఆలోవేరా) జెల్‍ను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల జుట్టు మెరుపు పెరుగుతుంది.
(pixabay)(4 / 7)
కొబ్బరి నూనె: జుట్టు మెరుపుతో ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి నూనె చాలా తోడ్పడుతుంది. కొబ్బరినూనెను కాస్త వేడి చేసి.. తలకు మర్దన చేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి కనీసం మూడుసార్లైనా ఇలా తలకు కొబ్బరినూనె రాసుకోవాలి. ఇలా చేస్తే షైనింగ్ బాగుంటుంది.
(pixabay)(5 / 7)
అవకాడో: అవకాడోను మధ్యలోకి కట్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఓ స్పూన్ తేనెతో ఈ పేస్ట్ కలపాలి. ఆ తర్వాత దాన్ని జుట్టుకు రాసుకొని అరగంట ఆరనివ్వాలి. అనంతరం తలస్నానం చేయాలి. అవకాడోలోని విటమిన్ ఏ, సీ, ఈ జుట్టును దృఢంగా చేయటంతో పాటు షైనీగా చేయగలదు.
(pixabay)(6 / 7)
ఆలివ్ ఆయిల్: ప్రతీ రోజు ఆలివ్ ఆయిల్‍ను జుట్టుకు రాసుకోవాలి. కాలుష్యం, యూవీ కిరణాల నుంచి జుట్టుకు ఇది రక్షణ కల్పిస్తుంది. మెరిసేలా చేస్తుంది. కాస్త వేడి చేసుకొని కూడా జుట్టుకు ఆలివ్ ఆయిల్ పూసుకోవచ్చు.
(pixabay)(7 / 7)
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత కండీషనర్ వాడడం మాత్రం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. తలను బ్రష్ చేయకూడదు. అలాగే, తలస్నానం చేశాక జుట్టును గట్టిగా తుడవకూడదు. మృధువైన టవల్‍తో సున్నితంగా తుడుచుకోవాలి.
(pixabay)ఇతర గ్యాలరీలు