తెలుగు న్యూస్ / ఫోటో /
relationship: పెళ్లికి, ప్రేమకి సిద్ధంగా లేరనడానికి ఇవే గుర్తులు
relationship: నిజమైన బంధాన్ని నిలుపుకోడానికి మానసిక పరిపక్వత, వ్యక్తిగత అవగాహన, ఏ విషయాన్నైనా స్పష్టంగా తెలియజేయగల నేర్పు అవసరం. అవి లేకపోతే బంధం నిలవదు. కొన్ని లక్షణాలు మీలో ఉన్నట్లు అనిపిస్తే మాత్రం మీరు పెళ్లికీ, ప్రేమకీ సిద్ధంగా లేరని అర్థం. అవేంటో తెలుసుకోండి.
(1 / 5)
మీ పాత బంధం గురించి మర్చిపోలేక పోవడం: మీకు కొత్తగా పరిచయమవుతున్న ప్రతి వ్యక్తినీ మీరు ఇదివరకు ప్రేమలో ఉన్న మనిషితో పోలిస్తే మీరు కొత్త బంధానికి సిద్ధంగా లేరని అర్థం. మనసులో పాత ఆలోచనల్ని పెట్టుకుని వేరొక మనిషిని మోసం చేసినట్లే అవుతుంది. మీ కొత్త బంధానికి ఇది మంచిది కాదు. ఆనందంగా ఉండలేరు. (Unsplash)
(2 / 5)
మీ తప్పుల్ని సరిచేసుకోండి: ఇది వరకు మీరున్న బంధంలో ఉన్న వ్యక్తి మీ వ్యక్తిత్వం వల్ల, మీ ప్రవర్తన వల్ల దూరమై ఉంటే.. మళ్లీ అవే తప్పులు చేయకండి. కాస్త సమయం తీసుకుని మీ తప్పుల్ని దిద్దుకోండి. ప్రవర్తన మార్చుకోండి. తొందరపడితే మీరు మొదలెట్టబోయే మరో ప్రేమ బంధం కూడా గాడి తప్పుతుంది. (Unsplash)
(3 / 5)
మీకు మీరు ముఖ్యం: పెళ్లి, ప్రేమలో ఏదైనా ఇద్దరి మనుషులు ఒకరి ఇష్టాలని, అవసరాలని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లడం. అంతేకానీ ప్రతిసారీ మీరే మీ ఇష్టాలని చంపుకోవద్దు. ఎదుటి వ్యక్తి ఇష్టాలను గౌరవించినట్లే, మీ ఇష్టాఇష్టాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఇచ్చిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. ఇవ్వడం మాత్రమే అలవాటు చేయకండి. మీ అవసరాలు కూడా తెలియజేయండి. (Unsplash)
(4 / 5)
ఒంటరిగా ఉండలేకపోవడం: అవును, ఒంటరిగా ఉండలేకపోతున్నారంటే ఒకరి తోడు కోరుకుంటున్నట్లు కాదు. ముందు మీతో మీరే ఆనందంగా ఉండలేకపోవడం ఒక లోపమని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడ్డప్పుడే ఎదుటివ్యక్తికి కూడా నచ్చుతారు. మీ సంతోషం కోసం వేరేవాళ్ల మీద పూర్తిగా ఆధారపడరు. (Unsplash)
(5 / 5)
ఎలాంటి వ్యక్తి కావాలో స్పష్టత ఉండాలి: బంధమేదైనా మీకెలాంటి వ్యక్తి కావాలనే విషయంలో స్పష్టత ఉండాలి. మీరావ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు? అనే విషయాలపై స్పష్టత తెచ్చుకోవాలి. లేదంటే కాస్త సమయం తీసుకోండి. దాన్ని బట్టి ముందడుగు వేయండి. అప్పుడే మీకు సరైన భాగస్వామిని ఎంచుకోగలుగుతారు. (Unsplash)
ఇతర గ్యాలరీలు