తెలుగు న్యూస్ / ఫోటో /
Narayanpeta District : జింకల గుంపు - పంటకు ముప్పు..! రైతన్నల సమస్య తీరేదెలా..?
- Deers Probelm in Makthal Mandal: నారాయణపేట జిల్లా పరిధిలోని పలు మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వేల సంఖ్యలో జింకల గుంపులు సంచరిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పంటల పాడైపోతున్నాయి.
- Deers Probelm in Makthal Mandal: నారాయణపేట జిల్లా పరిధిలోని పలు మండలాల్లో రైతులకు కృష్ణ జింకలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వేల సంఖ్యలో జింకల గుంపులు సంచరిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పంటల పాడైపోతున్నాయి.
(1 / 5)
కృష్ణా పరివాహక ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో కృష్ణ జింకలతో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. వందలాది సంఖ్యలో జింకలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి.
(3 / 5)
ప్రధానంగా చూస్తే నారాయమపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో వేల సంఖ్యలో ఈ జింకలు సంచరిస్తున్నాయి. ఇవి పంటలకు నష్టం కలిగిస్తూ… అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
(4 / 5)
ఈ కృష్ణ జింకలు మిగతా వన్యప్రాణుల్లా అడవుల్లో కాకుండా గడ్డిభూములు, పంటపొలాలు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. వీటి సమీపంలోని పంటలపై ఆధారపడతాయి. మక్తల్ మండలానికి జురాల ప్రాజెక్ట్ సమీపంలో ఉంటుంది. బ్యాక్ వాటర్ ప్రాంతంలో భారీగా సంచరిస్తున్న ఈ జింకలు… రైతుల వేస్తున్న పంటలకు తీవ్రస్థా.యిలో నష్టం చేకూరుస్తున్నాయి.
(5 / 5)
పంటల రక్షణకు రైతులు రాత్రి వేళల్లో పొలాల దగ్గర కాపలా ఉంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్య పరిష్కరించాలని ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకొని జింకలను వేరే ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.(రిపోర్టింగ్ : ఈ ఫొటోలు మక్తల్ మండల పరిధిలోని కర్ని గ్రామంలో తీసినవి. రామకృష్ణా రెడ్డి, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్)
ఇతర గ్యాలరీలు