తెలుగు న్యూస్ / ఫోటో /
Eng vs Scot T20 WC 2024: ఇంగ్లండకు చుక్కలు చూపించిన స్కాట్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్‌ను కరుణించిన వరుణుడు
- Eng vs Scot T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను వరుణుడు కరుణించాడు. స్కాట్లాండ్ ఓపెనర్లు చెలరేగి భారీ స్కోరు చేసినా.. వర్షంతో ఈ మ్యాచ్ రద్దయింది.
- Eng vs Scot T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను వరుణుడు కరుణించాడు. స్కాట్లాండ్ ఓపెనర్లు చెలరేగి భారీ స్కోరు చేసినా.. వర్షంతో ఈ మ్యాచ్ రద్దయింది.
(1 / 6)
Eng vs Scot T20 WC 2024: డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో టీ20 వరల్డ్ కప్ 2024లో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు తొలి మ్యాచ్ లోనే స్కాట్లాండ్ గట్టి షాకిచ్చేలా కనిపించింది. కానీ సమయానికి వర్షం పడటంతో ఈ మ్యాచ్ రద్దయింది.
(2 / 6)
Eng vs Scot T20 WC 2024: గ్రూప్ బిలో భాగంగా మంగళవారం (జూన్ 4) జరగాల్సిన ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. స్కాట్లాండ్ ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాస్ తర్వాత వర్షం పడటంతో మ్యాచ్ ఆలస్యమైంది.
(3 / 6)
Eng vs Scot T20 WC 2024: వర్షం తర్వాత స్కాట్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. పవర్ ప్లే ఆరు ఓవర్లలోనే స్కాట్లాండ్ ఓపెనర్లు 49 రన్స్ జోడించారు. 6.2 ఓవర్ల దగ్గర మరోసారి వర్షం కురిసింది. ఆ తర్వాత మ్యాచ్ ను 10 ఓవర్లకు కుదించారు.
(4 / 6)
Eng vs Scot T20 WC 2024: ఆ తర్వాత కూడా స్కాట్లాండ్ ఓపెనర్లు జోరు కొనసాగించారు. దీంతో ఆ టీమ్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 రన్స్ చేసింది. మున్సే 31 బంతుల్లోనే 41, మైఖేల్ జోన్స్ 30 బంతుల్లోనే 45 రన్స్ చేశారు.
(5 / 6)
Eng vs Scot T20 WC 2024: మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ లాంటి బౌలర్లు ఉన్నా.. ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.
(6 / 6)
Eng vs Scot T20 WC 2024: డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్ కు 10 ఓవర్లలో 109 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ ఆ సమయంలో మరోసారి భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. దీంతో రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది. నిజానికి ఇంగ్లండ్ కు అది భారీ లక్ష్యమే అయి ఉండేది. సమయానికి వరుణుడు రావడంతో ఊపిరి పీల్చుకుందని చెప్పాలి.
ఇతర గ్యాలరీలు