తెలుగు న్యూస్ / ఫోటో /
Flying Car X2 | దుబాయ్‌లో ఫ్లైయింగ్ కార్ టాక్సీలు వచ్చేశాయి.. ఇక ఎగిరిపోవచ్చు!
- Flying Car: ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు చూసుంటారు. మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా? ఓడల్లాంటి లగ్జరీ కార్లకు దుబాయ్ ప్రసిద్ధి. ఇప్పుడక్కడా గాలిలో ఎగిరే ఫ్లైయింగ్ కార్లు కూడా వచ్చేశాయి. చూడటానికి డ్రోన్ లాగా కనిపిస్తున్న ఈ కార్ పై మీరూ ఓ లుక్ ఇవ్వండి.
- Flying Car: ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ కార్లు, మాగ్నెటిక్ కార్లు, సోలార్ కార్లు చూసుంటారు. మరి ఎప్పుడైనా ఎగిరే కార్లను చూశారా? ఓడల్లాంటి లగ్జరీ కార్లకు దుబాయ్ ప్రసిద్ధి. ఇప్పుడక్కడా గాలిలో ఎగిరే ఫ్లైయింగ్ కార్లు కూడా వచ్చేశాయి. చూడటానికి డ్రోన్ లాగా కనిపిస్తున్న ఈ కార్ పై మీరూ ఓ లుక్ ఇవ్వండి.
(1 / 8)
చైనీస్ ఎలక్ట్రానిక్ వాహన తయారీ సంస్థ Xpeng Inc రూపొందించిన "Flying Car" యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తన మొదటి పబ్లిక్ ఫ్లైట్‌ను ప్రారంభించింది.(AFP)
(2 / 8)
X2 పేరుగల ఈ ఫ్లైయింగ్ కారులో రెండు-సీట్లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) చేసే చిన్న హెలికాప్టర్ లాంటిది దీనికి ఎనిమిది ప్రొపెల్లర్లు ఉన్నాయి.(REUTERS)
(3 / 8)
దుబాయ్‌లో సోమవారం మానవరహితంగా (ఖాళీగా) ఈ ఫ్లైయింగ్ కారును 90 నిమిషాల పాటు పరీక్షించారు. ఈ ఎగిరే కారు వేగం గంటకు 130 కిమీలు(REUTERS)
(4 / 8)
Xpeng Inc కంపెనీ కేవలం దుబాయ్‌లోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విడుదల చేయడానికి కృషి చేస్తోంది.(REUTERS)
(5 / 8)
Xpeng Aerohut మేనేజర్ Mingguan Qiu మాట్లాడుతూ, 'తాము అంతర్జాతీయ మార్కెట్‌లోకి తమ కార్లను ప్రవేశపెట్టదలుచుకున్నాము, అయితే దుబాయ్ ప్రపంచంలోనే సరికొత్త నగరం కాబట్టి మొదటగా దుబాయ్‌ని ఎంచుకున్నాము' అని తెలిపారు.(REUTERS)
(6 / 8)
ఎగిరే కారుకు సంబంధించిన అధునాతన వెర్షన్‌ను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది. కేవల ఎగరడమే కాకుండా రోడ్డు మీద కూడా నడిపేలా కొత్తకారును రూపొందించనుంది. ప్రస్తుత X2 కారు కేవలం ఎగరగలదు.(REUTERS)
(7 / 8)
కొత్త వెర్షన్ ఫ్లైయింగ్ కారులో ప్రజలు ఎలాంటి దారిలో అయినా గమ్యాన్ని చేరవచ్చు. రోడ్డుపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్లవచ్చు. రోడ్డు ఎండ్ అయితే గాలిలో ఎగిరి వెళ్లిపోవచ్చు ఇండెలికేట్ డ్రైవింగ్ మోడ్ సహాయంతో ఎవరైనా ఈ కారును నడపవచ్చు అని కంపెనీ పేర్కొంది.(REUTERS)
ఇతర గ్యాలరీలు