Cardamom: ప్రతిరోజూ రెండు యాలకులు తింటే డయాబెటిస్ నుంచి కాలేయ వ్యాధుల వరకు రాకుండా అడ్డుకోవచ్చు-eating two cardamoms every day can prevent diabetes and liver diseases ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Cardamom: ప్రతిరోజూ రెండు యాలకులు తింటే డయాబెటిస్ నుంచి కాలేయ వ్యాధుల వరకు రాకుండా అడ్డుకోవచ్చు

Cardamom: ప్రతిరోజూ రెండు యాలకులు తింటే డయాబెటిస్ నుంచి కాలేయ వ్యాధుల వరకు రాకుండా అడ్డుకోవచ్చు

Sep 02, 2024, 11:02 AM IST Haritha Chappa
Sep 02, 2024, 11:02 AM , IST

Cardamom: యాలకులు చాలా ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. మనం ప్రధానంగా యాలకులను మౌత్ ఫ్రెష్నర్ గా లేదా ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము. అయితే యాలకులను తినడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వంటివి రాకుండా అడ్డుకోవచ్చు. 

యాలకులు ముఖ్యమైన మసాలా దినుసులు. మనం ప్రధానంగా యాలకులను మౌత్ ఫ్రెష్నర్ గా, రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటాం. దీనిని అనేక తీపి వంటలలో వాడతారు.  యాలకులు  కేవలం రుచి, వాసనకే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి ఉపయోగపడుతుంది.

(1 / 8)

యాలకులు ముఖ్యమైన మసాలా దినుసులు. మనం ప్రధానంగా యాలకులను మౌత్ ఫ్రెష్నర్ గా, రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటాం. దీనిని అనేక తీపి వంటలలో వాడతారు.  యాలకులు  కేవలం రుచి, వాసనకే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడానికి ఉపయోగపడుతుంది.(pixabay )

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా  ఉండటం వల్ల  అవి కళ్లను కాపాడుతాయి. ఇది కళ్ళకు చాలా ప్రయోజనకరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.

(2 / 8)

యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా  ఉండటం వల్ల  అవి కళ్లను కాపాడుతాయి. ఇది కళ్ళకు చాలా ప్రయోజనకరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.(pixabay)

యాలకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోకెమికల్స్ ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం యాలకులు  క్యాన్సర్ కణితి పరిమాణాన్ని,  బరువును తగ్గిస్తాయని తేల్చాయి. ఇది క్యాన్సర్ ను నివారించడంలో ముందుంటాయి.

(3 / 8)

యాలకుల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోకెమికల్స్ ఉన్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం యాలకులు  క్యాన్సర్ కణితి పరిమాణాన్ని,  బరువును తగ్గిస్తాయని తేల్చాయి. ఇది క్యాన్సర్ ను నివారించడంలో ముందుంటాయి.(pixabay)

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. యాలకులు యాంటీఆక్సిడెంట్, మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి, యాలకులు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. 

(4 / 8)

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. యాలకులు యాంటీఆక్సిడెంట్, మూత్రవిసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి, యాలకులు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. (pixabay)

యాలకులు కడుపులో అల్సర్లను నివారించడానికి, చికిత్స చేయడానికి సహాయపడతాయి. యాలకుల రసం కడుపులోని ప్రేగులను రక్షించడం ద్వారా పొత్తికడుపులో అల్సర్ల పరిమాణాన్ని తగ్గిస్తాయి. 

(5 / 8)

యాలకులు కడుపులో అల్సర్లను నివారించడానికి, చికిత్స చేయడానికి సహాయపడతాయి. యాలకుల రసం కడుపులోని ప్రేగులను రక్షించడం ద్వారా పొత్తికడుపులో అల్సర్ల పరిమాణాన్ని తగ్గిస్తాయి. (pixabay )

డయాబెటిస్ ఉన్న వారు యాలకులను ప్రతిరోజూ తినడం మంచిది. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. యాలకుల్లో ఫైబర్,  మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి, ఇది బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచడంలో గొప్పగా సహాయపడుతుంది, కాబట్టి యాలకులు డయాబెటిస్ ను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

(6 / 8)

డయాబెటిస్ ఉన్న వారు యాలకులను ప్రతిరోజూ తినడం మంచిది. ఇది బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. యాలకుల్లో ఫైబర్,  మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి, ఇది బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచడంలో గొప్పగా సహాయపడుతుంది, కాబట్టి యాలకులు డయాబెటిస్ ను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.(pixabay)

ఆయుర్వేద వైద్యంలో యాలకులు విషరహిత లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. నాన్  ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడేవారిలో యాలకులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. జంతు అధ్యయనాలు కూడా యాలకులు కాలేయంలో ఒత్తిడిని తగ్గించి కొవ్వు పదార్థాల వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతాయని నిరూపించాయి.

(7 / 8)

ఆయుర్వేద వైద్యంలో యాలకులు విషరహిత లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. నాన్  ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో బాధపడేవారిలో యాలకులు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. జంతు అధ్యయనాలు కూడా యాలకులు కాలేయంలో ఒత్తిడిని తగ్గించి కొవ్వు పదార్థాల వల్ల కలిగే నష్టం నుండి కాపాడుతాయని నిరూపించాయి.(pixabay)

గుండె ఆరోగ్యం:  యాలకులు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.ఈ  ప్రయోజనాలు గుండె పనితీరును పెంచే యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఉన్నాయని నమ్ముతారు.

(8 / 8)

గుండె ఆరోగ్యం:  యాలకులు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మెరుగుపరుస్తాయి.ఈ  ప్రయోజనాలు గుండె పనితీరును పెంచే యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఉన్నాయని నమ్ముతారు.(pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు