Dy CM Pawan Kalyan : గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం-dy cm pawan kalyan visited vizianagaram gurla diarrhea victims assured one lakh compensation ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Dy Cm Pawan Kalyan : గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

Dy CM Pawan Kalyan : గుర్ల డయేరియా మృతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

Oct 21, 2024, 03:59 PM IST Bandaru Satyaprasad
Oct 21, 2024, 03:59 PM , IST

Dy CM Pawan Kalyan : విజయనగం జిల్లా గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు. అతిసారం ప్రబలి చనిపోయిన మృతుల కుటుంబాలకు తాను వ్యక్తిగతంగా రూ.1 లక్ష పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు.

గుర్ల గ్రామంలో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా తాను లక్ష రూపాయల పరిహారం అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ నివేదిక వచ్చాక ప్రభుత్వం తరఫున కూడా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం గుర్ల గ్రామంలో డయేరియా ప్రభావంపై 8 మంది మృతి చెందారు. 100 మందికి పైగా అతిసారంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

(1 / 7)

గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో డయేరియా ప్రబలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పవన్ కల్యాణ్ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. 

(2 / 7)

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నదిపై ఉన్న రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు పవన్ కల్యాణ్ కు తెలియజేశారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచి నీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు పవన్ కు వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ అవుతుందన్న దానిపై పవన్ ఆరా తీశారు. 

(3 / 7)

విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో పవన్ కల్యాణ్ నేతలు, అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గత ప్రభుత్వం 5 ఏళ్లలో కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదన్నారు. అవి మార్చి ఉంటే నీరు కలుషితం అవ్వకుండా ఫిల్టరింగ్ సక్రమంగా జరిగి ఉండేదన్నారు. 15 వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టి ఈ పనులు చేయవచ్చని,  గతంలో నిధులు పక్కదారి పట్టాయన్నారు.  

(4 / 7)

ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ ద్వారా బహిరంగ మల విసర్జన అరికట్టేందుకు ప్రచారం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. అయినప్పటికీ చాలా చోట్ల ఓపెన్ డెఫికేషన్ కొనసాగుతోందన్నారు. ఇందువల్ల నీటి పరివాహక ప్రాంతాలు కలుషితం అయి, ఆ నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నారన్నారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.  

(5 / 7)

కేంద్ర ప్రభుత్వం పంచాయతీ, జల్ జీవన్ మిషన్ కోసం నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. త్వరలో మరో రూ.650 కోట్లు గ్రామీణ నీటి సరఫరా కోసం కేంద్ర నిధులు రానున్నాయన్నారు. వాటిని కూడా నీటి సరఫరా మెరుగుపరిచేందుకు, రక్షిత మంచినీరు అందించేందుకు వినియోగించనున్నామని తెలిపారు. 

(6 / 7)

"బహిరంగ మలవిసర్జన కారణంగా నీటిని కలుషితం చేస్తున్నారు. దీని వలన మీ ప్రాణాలే కాకుండా ప్రజల ప్రాణాలు ప్రమాదంలోకి నెడుతున్నారు. కచ్చితంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా అవగాహన కల్పించాలి. అధికారులు, పంచాయతీ సర్పంచ్ లు బాధ్యత తీసుకోవాలి" - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు