Telangana Secretariat: సాగర తీరాన మరో అద్భుతం.. ఆత్మగౌరవ ప్రతీకగా 'కొత్త సచివాలయం'-dr br ambedkar telangana secretariat photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Telangana Secretariat: సాగర తీరాన మరో అద్భుతం.. ఆత్మగౌరవ ప్రతీకగా 'కొత్త సచివాలయం'

Telangana Secretariat: సాగర తీరాన మరో అద్భుతం.. ఆత్మగౌరవ ప్రతీకగా 'కొత్త సచివాలయం'

Apr 30, 2023, 09:50 AM IST HT Telugu Desk
Apr 30, 2023, 09:50 AM , IST

  • Dr BR Ambedkar Telangana Secretariat:  ఇవాళ తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా కొత్త భవనానికి మరిన్ని మెరుగులద్దారు. సాగరతీరాన సచివాలయం వజ్రంలా మెరుస్తోంది. రంగురంగుల కాంతుల్లో వెలిగిపోతుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం అందర్నీ కట్టిపడేస్తోంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తోంది.

(1 / 6)

తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు.. ఇందులో 8 ఎకరాలను పూర్తిగా పచ్చదనం కోసమే కేటాయించారు.

(2 / 6)

కొత్త సచివాలయంలో 11 అంతస్తుల ఎత్తుతో ప్రధాన నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలన కేంద్రీకృతం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలను ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు..ఇండో పర్షియన్‌ శైలిలో డోముల నిర్మాణం జరిగింది.

(3 / 6)

ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 

(4 / 6)

సచివాలయంలో అద్భుతమైన, సౌకర్యవంతమైన ఫర్నిచర్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 వేల ఫర్నిచర్‌ వస్తువులు అందుబాటులో ఉంచారు. మంత్రులకు 23 చాంబర్లు ఏర్పాటు చేశారు. 26 కాన్ఫరెన్స్‌ రూములు ఉన్నాయి. మరో 4 కాన్ఫరెన్స్‌ హాళ్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సచివాలయంలోని ప్రతీ ఫ్లోర్‌లో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా డైనింగ్‌ ఏరియాను ఏర్పాటు చేశారు.

(5 / 6)

మంత్రులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, సీఎస్‌కు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించారు. 1,190 మంది సెక్షన్‌ ఆఫీసర్లకు, 106 మంది అసిస్టెంట్‌ సెక్రటరీలు, 59 మంది డిప్యూటీ సెక్రటరీలకు, 29 మంది అదనపు/జాయింట్‌ సెక్రటరీలకు, 58 మంది సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులకు ప్రత్యేకంగా జాబితాలు రూపొందించి దాని ఆధారంగా ఎన్ని సీట్లు, ఎంత మంది విజిటర్‌ సీట్లు, సోఫాలు ఎన్ని, టీవీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఎన్ని అనేది పక్కాగా లెక్కలు వేసి ఏర్పాటు చేశారు. ఇవేకాకుండా ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ సదుపాయం సిద్ధం చేశారు.. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు