వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ గ్రీటింగ్స్-diwali at white house joe biden hosts celebration with indian americans sunita williams diwali greetings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ గ్రీటింగ్స్

వైట్‌ హౌస్‌లో దీపావళి వేడుకలు.. అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ గ్రీటింగ్స్

Oct 29, 2024, 11:43 AM IST Anand Sai
Oct 29, 2024, 11:43 AM , IST

  • White House Diwali Celebrations : దీపాల పండుగను పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో వైట్ హౌస్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యోమగామి సునీతా విలియమ్స్ ప్రత్యేక సందేశాన్ని అంతరిక్షం నుంచి పంపారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్ డీసీలోని వైట్‌ హౌస్‌లో 600 మందితో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రముఖులు పాల్గొన్నారు.

(1 / 5)

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాషింగ్టన్ డీసీలోని వైట్‌ హౌస్‌లో 600 మందితో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రముఖులు పాల్గొన్నారు.(Photographer: Jim Lo Scalzo/EPA/Bloomberg)

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా పిల్లలను తీసుకుని అధ్యక్షుడు జో బైడెన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకాలేదు. అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్నారు. 2003 నుంచి ఆనవాయితీగా వస్తున్న దీపావళి వేడుకల సంప్రదాయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. 2016లో తాను, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యమిచ్చిన తొలి దీపావళి వేడుకను గుర్తు చేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురించి కూడా జో బైడెన్ ప్రస్తావించారు.

(2 / 5)

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా పిల్లలను తీసుకుని అధ్యక్షుడు జో బైడెన్ ఈ కార్యక్రమంలోకి ప్రవేశించారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హాజరుకాలేదు. అధ్యక్ష ఎన్నికల బిజీలో ఉన్నారు. 2003 నుంచి ఆనవాయితీగా వస్తున్న దీపావళి వేడుకల సంప్రదాయాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కొనసాగించారు. 2016లో తాను, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆతిథ్యమిచ్చిన తొలి దీపావళి వేడుకను గుర్తు చేశారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గురించి కూడా జో బైడెన్ ప్రస్తావించారు.(AP)

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించిన అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. మూర్తి భారత సంతతికి చెందిన మొదటి సర్జన్ జనరల్. అతని తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు.

(3 / 5)

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో పర్యటించిన అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. మూర్తి భారత సంతతికి చెందిన మొదటి సర్జన్ జనరల్. అతని తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు.((Photo by Mandel NGAN / AFP))

శ్వేతసౌధంలో దీపాన్ని వెలిగించి అమెరికా ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇలాంటి వెలుగు ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వలసదారుల పట్ల అనుమానం, ద్వేషం నుండి ఇప్పుడు దీపావళి మారిపోయిందని జో బైడెన్ అన్నారు. ఎన్నికలు దేశానికి నిర్ణయాత్మక అంశంగా ఉంటాయని అన్నారు.

(4 / 5)

శ్వేతసౌధంలో దీపాన్ని వెలిగించి అమెరికా ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇలాంటి వెలుగు ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వలసదారుల పట్ల అనుమానం, ద్వేషం నుండి ఇప్పుడు దీపావళి మారిపోయిందని జో బైడెన్ అన్నారు. ఎన్నికలు దేశానికి నిర్ణయాత్మక అంశంగా ఉంటాయని అన్నారు.(AP)

మరోవైపు వ్యోమగామి సునీత  విలియమ్స్ రికార్డ్ చేసిన వీడియో సందేశంతో దీపావళి కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకం చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి ఆమె పంపిన సందేశంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. 'ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తు నుండి దీపావళి జరుపుకొనే అరుదైన అవకాశం నాకు లభించింది.' అని ఆమె అన్నారు. దీపావళి వంటి పండుగ ప్రాముఖ్యత గురించి, తన సాంస్కృతిక మూలాలను కొనసాగించడం గురించి సునీత విలియమ్స్ చెప్పారు.

(5 / 5)

మరోవైపు వ్యోమగామి సునీత  విలియమ్స్ రికార్డ్ చేసిన వీడియో సందేశంతో దీపావళి కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకం చేశారు. అంతరిక్ష కేంద్రం నుంచి ఆమె పంపిన సందేశంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. 'ఈ సంవత్సరం భూమికి 260 మైళ్ల ఎత్తు నుండి దీపావళి జరుపుకొనే అరుదైన అవకాశం నాకు లభించింది.' అని ఆమె అన్నారు. దీపావళి వంటి పండుగ ప్రాముఖ్యత గురించి, తన సాంస్కృతిక మూలాలను కొనసాగించడం గురించి సునీత విలియమ్స్ చెప్పారు.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు