Ramadan celebrations: ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటారిలా..-different ways muslims across the world celebrate ramadan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Different Ways Muslims Across The World Celebrate Ramadan

Ramadan celebrations: ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగను జరుపుకుంటారిలా..

Mar 17, 2023, 02:58 PM IST HT Telugu Desk
Mar 17, 2023, 02:58 PM , IST

Ramadan celebrations: రంజాన్. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ. ఇస్లామిక్ క్యాలండర్ ప్రకారం 9 నెలలో రంజాన్ జరుపుకుంటారు. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రోజంతా కఠిన ఉపవాసం ఆచరిస్తారు. ఖురాన్ లో పేర్కొన్న జీవన విధానాన్ని అవలంబిస్తారు.

Ramadan celebrations: చిన్నాపెద్దా, పేద సంపన్న తేడా లేకుండా రంజాన్ మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఆచరిస్తారు. తమ ఇళ్లను, వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. 

(1 / 7)

Ramadan celebrations: చిన్నాపెద్దా, పేద సంపన్న తేడా లేకుండా రంజాన్ మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఆచరిస్తారు. తమ ఇళ్లను, వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. (AFP)

Ramadan celebrations:  రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టగా ఉపవాసం ఆచరిస్తారు. సూర్యాస్తమయం తరువాతనే భోజనం చేస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాల్లో బంధు మిత్రులంతా కలిసి ఈ ఇఫ్తార్ ఆరగిస్తారు.

(2 / 7)

Ramadan celebrations:  రంజాన్ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నిష్టగా ఉపవాసం ఆచరిస్తారు. సూర్యాస్తమయం తరువాతనే భోజనం చేస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఈజిప్ట్, ఇతర అరబ్ దేశాల్లో బంధు మిత్రులంతా కలిసి ఈ ఇఫ్తార్ ఆరగిస్తారు.(AFP)

Ramadan celebrations: రంజాన్ మాసంలో ముస్లింలు అదనంగా తారావి (Tarawih) ప్రార్థనలు జరుపుతారు.

(3 / 7)

Ramadan celebrations: రంజాన్ మాసంలో ముస్లింలు అదనంగా తారావి (Tarawih) ప్రార్థనలు జరుపుతారు.(HT photos/Praful Gangurde)

Ramadan celebrations: రంజాన్ సందర్భంగా ముస్లింలు జకత్ (Zakat) పేరుతో పేదలకు దానధర్మాలు చేస్తారు. జకత్ ను ముస్లింలు కచ్చితంగా ఆచరించాల్సిన విషయంగా ఖురాన్ స్పష్టం చేస్తుంది.

(4 / 7)

Ramadan celebrations: రంజాన్ సందర్భంగా ముస్లింలు జకత్ (Zakat) పేరుతో పేదలకు దానధర్మాలు చేస్తారు. జకత్ ను ముస్లింలు కచ్చితంగా ఆచరించాల్సిన విషయంగా ఖురాన్ స్పష్టం చేస్తుంది.(AFP)

Ramadan celebrations: సూర్యోదయం ముందు ముస్లింలు ఆరగించే భోజనాన్ని సహార్ (Suhoor) అంటారు. రోజంతా ఉపవాసం ఉండడానికి అవసరమైన శక్తి లభించడం కోసం సూర్యోదయం ముందు కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుంటారు.

(5 / 7)

Ramadan celebrations: సూర్యోదయం ముందు ముస్లింలు ఆరగించే భోజనాన్ని సహార్ (Suhoor) అంటారు. రోజంతా ఉపవాసం ఉండడానికి అవసరమైన శక్తి లభించడం కోసం సూర్యోదయం ముందు కొద్ది మొత్తంలో ఆహారం తీసుకుంటారు.(AFP)

Ramadan celebrations: రంజాన్ మాసంలో మొరాకో, టర్కీ లాంటి దేశాల్లో కచ్చితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఉంటారు. ఉపవాసం అనంతరం కలిసే భోజనం చేస్తారు. 

(6 / 7)

Ramadan celebrations: రంజాన్ మాసంలో మొరాకో, టర్కీ లాంటి దేశాల్లో కచ్చితంగా కుటుంబ సభ్యులంతా కలిసే ఉంటారు. ఉపవాసం అనంతరం కలిసే భోజనం చేస్తారు. (AFP)

Ramadan celebrations: రంజాన్ మాసంలో నైట్ మార్కెట్స్ చాలా ఫేమస్. హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతం ఈ రంజాన్ నెలలో రాత్రంతా వెలుగులీనుతూ, షాపింగ్ కు వచ్చిన వారితో సందడిగా ఉంటుంది.. 

(7 / 7)

Ramadan celebrations: రంజాన్ మాసంలో నైట్ మార్కెట్స్ చాలా ఫేమస్. హైదరాబాద్ లోని చార్మినార్ ప్రాంతం ఈ రంజాన్ నెలలో రాత్రంతా వెలుగులీనుతూ, షాపింగ్ కు వచ్చిన వారితో సందడిగా ఉంటుంది.. (AFP)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు