LPG eKYC Update : ఎల్పీజీ ఈకేవైసీకి తుది గడువు విధించలేదు, కేంద్ర మంత్రి క్లారిటీ-delhi union minister hardeep singh puri clarified no deadline for lpg ekyc process ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lpg Ekyc Update : ఎల్పీజీ ఈకేవైసీకి తుది గడువు విధించలేదు, కేంద్ర మంత్రి క్లారిటీ

LPG eKYC Update : ఎల్పీజీ ఈకేవైసీకి తుది గడువు విధించలేదు, కేంద్ర మంత్రి క్లారిటీ

Jul 09, 2024, 05:43 PM IST Bandaru Satyaprasad
Jul 09, 2024, 05:43 PM , IST

  • LPG eKYC Update : వంట గ్యాస్ ఈకేవైసీపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈకేవైసీ నమోదుకు తుది గడువు విధించలేదని స్పష్టం చేసింది. బోగస్ కస్టమర్లను తొలగించేందుకు చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ ఆధార్ లింకింక్ ప్రక్రియ చేపట్టింది.

వంట గ్యాస్ ఈకేవైసీపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈకేవైసీ నమోదుకు తుది గడువు విధించలేదని స్పష్టం చేసింది. బోగస్ కస్టమర్లను తొలగించేందుకు చమురు కంపెనీలు గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ ఆధార్ లింకింక్ ప్రక్రియ చేపట్టింది. 

(1 / 6)

వంట గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ నమోదు చేయాలని కేంద్రప్రభుత్వం చమురు కంపెనీలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఎల్‌పీజీ కంపెనీలు ఈకేవైసీ అప్డేట్ చేస్తున్నాయి. గ్యాస్‌ ఏజెన్సీల వద్దే ఈకేవైసీని నమోదు చేయాలని కొన్ని కంపెనీలు సూచిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

(2 / 6)

గ్యాస్ ఈకేవైసీ గడువుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేరళ శాసనసభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీకి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి గ్యాస్ ఈకేవైసీపై క్లారిటీ ఇచ్చారు. ఈకేవైసీ అప్డేట్ కు ఎలాంటి తుది గడువు విధించలేదని స్పష్టం చేశారు.

(3 / 6)

బోగస్ కస్టమర్‌లను తొలగించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్  కస్టమర్‌ల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టాయని కేంద్ర మంత్రి తెలిపారు. 8 నెలలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ల ద్వారా వాణిజ్య సిలిండర్‌లు తరచుగా బుక్ అవుతున్నాయని, వీటిని నిరోధించడానికి ఈకేవైసీ చేపట్టామన్నారు. 

(4 / 6)

ఈ ప్రక్రియలో గ్యాస్ డెలివరీ సిబ్బంది కస్టమర్‌కు సిలిండర్‌లను డెలివరీ చేసేటప్పుడు ఆధారాలను ధృవీకరిస్తారు. డెలివరీ సిబ్బంది తమ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కస్టమర్ ఆధార్ వివరాలను యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తారు. కస్టమర్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి ఉపయోగించే OTPని తెలుసుకుంటారు. ఈకేవైసీ అప్డేట్ కోసం కస్టమర్లు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను సంప్రదించవచ్చు. 

(5 / 6)

కస్టమర్‌లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుని, eKYC స్వంతంగా పూర్తి చేయవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లేదా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి తుది గడువు విధించలేదని తెలిపింది.   

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు