తెలుగు న్యూస్ / ఫోటో /
Virat Kohli@15 Years: టీమిండియాలోకి కోహ్లి అడుగుపెట్టి 15 ఏళ్లు.. ఇవీ అతని ఘనతలు
- Virat Kohli@15 Years: టీమిండియాలోకి కోహ్లి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008, ఆగస్ట్ 18న తొలిసారి శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లి. ఈ 15 ఏళ్లలో కోహ్లి సాధించిన ఘనతలేంటో ఒకసారి చూద్దాం.
- Virat Kohli@15 Years: టీమిండియాలోకి కోహ్లి అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008, ఆగస్ట్ 18న తొలిసారి శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లి. ఈ 15 ఏళ్లలో కోహ్లి సాధించిన ఘనతలేంటో ఒకసారి చూద్దాం.
(1 / 7)
Virat Kohli@15 Years: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిది రెండో స్థానం. అతడు వన్డేలు, టెస్టులు, టీ20లు కలిపి మొత్తం 76 సెంచరీలు చేశాడు. వన్డేలలో 46, టెస్టుల్లో 29, టీ20లో ఒక సెంచరీ చేశాడు. సచిన్ (100 సెంచరీలు) తర్వాత కోహ్లిదే ఈ ఘనత.
(2 / 7)
Virat Kohli@15 Years: అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డులు కూడా విరాట్ కోహ్లి సొంతం. అతడు తన కెరీర్లో మొత్తం 20 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్నాడు.(BCCI Twitter)
(3 / 7)
Virat Kohli@15 Years: వన్డే క్రికెట్ లో ఇండియా తరఫున అత్యధిక క్యాచ్ లు పట్టిన రికార్డు కోహ్లి పేరిట ఉంది. విరాట్ వన్డేల్లో మొత్తం 142 క్యాచ్ లు పట్టాడు.(AFP)
(4 / 7)
Virat Kohli@15 Years: వన్డేల్లో 7 వేల నుంచి 12 వేల పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా అందుకున్న బ్యాటర్ కోహ్లినే. అతడు మరో 102 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 13 వేల పరుగులు సాధించిన రికార్డునూ సొంతం చేసుకుంటాడు.(Getty)
(5 / 7)
Virat Kohli@15 Years: వన్డేలలో కనీసం 50 ఇన్నింగ్స్ ఆడిన బ్యాటర్లలో విరాట్ కోహ్లిదే అత్యుత్తమ సగటు. అతడు 275 వన్డేల్లో ఏకంగా 57.3 సగటుతో పరుగులు చేశాడు.(File)
(6 / 7)
Virat Kohli@15 Years: వన్డేల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీల రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది. అతడు శ్రీలంకపై వన్డేలలో ఏకంగా 10 సెంచరీలు చేశాడు.
ఇతర గ్యాలరీలు