CM Chandrababu : కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్, తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి - సీఎం చంద్రబాబు-cm chandrababu orders officials ready integrated action for kuppam development ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cm Chandrababu : కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్, తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి - సీఎం చంద్రబాబు

CM Chandrababu : కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్, తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి - సీఎం చంద్రబాబు

Jun 26, 2024, 05:52 PM IST Bandaru Satyaprasad
Jun 26, 2024, 05:52 PM , IST

  • CM Chandrababu : సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పంలో పర్యటించిన ఆయన... అధికారులతో సమావేశం అయ్యారు. కుప్పం అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.

పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం...పేదరికం లేని మండలం... పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీని కోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్...ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు...ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంబోతుంది అని సీఎం అన్నారు. అధికారులు ఫిజికల్...వర్చ్యువల్ పని విధానాలకు సిద్దపడాలని అన్నారు. కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. 

(1 / 6)

బలవంతపు జనసమీకరణతో పెద్ద పెద్దమీటింగ్ లు,  భారీ కాన్వాయ్ లతో సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని సీఎం చంద్రబాబు చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే చెప్పానన్నారు.  అధికారుల కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి...ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించారు. 

(2 / 6)

కుప్పం అతిథి గృహంలో చిత్తూరు జిల్లా, నియోజకవర్గ అధికారులతో బుధవారం సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. సమీక్షంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘‘కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తి వేయండి...రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. గత 5 ఏళ్లు అధికారులు మనసు చంపుకుని పనిచేశారు" 

(3 / 6)

వైసీపీ నేతల పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారని సీఎం చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజకవర్గానికి తాను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత ఐదేళ్లలో కల్పించారన్నారు. తన పైనా హత్యాయత్నం కేసు పెట్టారన్నారు.  2019 వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని, కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారన్నారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై తాను చాలా బాధపడ్డానన్నారు. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు అన్నారు.  

(4 / 6)

కుప్పం నియోజకవర్గంలో కొన్ని సమస్యలు సవాళ్లు విసురుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా ఇంటింటికీ తాగునీరివ్వడంతో పాటు, హంద్రీనీవా కాల్వ పనులు పూర్తికి ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు.  వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలన్నారు. డైరీ, మిల్క్, సిల్క్, హనీ ఉత్పత్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

(5 / 6)

కుప్పానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తెస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేస్తామన్నారు. యువతలో నైపుణ్యాన్ని లెక్కించేందుకు, అవకాశాలు కల్పించేందుకు, వారిలో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక ప్రాణాళిక అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని.....నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులకు, సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు